ట్రైలర్ టాక్.. టూత్ బ్రష్ కోసం కొడుకుపై కేసు
దీంతో డాక్టర్ అతన్ని పల్లబురుసు, అంటే టూత్ బ్రష్ వాడమని సలహా ఇస్తాడు. తన కోసం ఒక బ్రష్ కొనుక్కురారా అని ఆ తండ్రి కొడుకుని అడుగుతాడు.
By: M Prashanth | 7 Aug 2026 10:44 AM ISTఇండస్ట్రీలో ఎప్పుడూ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలే కాదు, అప్పుడప్పుడు మట్టి వాసనను గుర్తుచేసే స్వచ్ఛమైన పల్లెటూరి కథలు కూడా హైలెట్ అవుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఒక క్యూట్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో రాబోతున్న కొత్త సినిమానే 'పల్లబురుసు'. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ను కింగ్ నాగార్జున అఫీషియల్ గా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ లాంటి పెద్ద బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తుండటంతో ఇండస్ట్రీలో కూడా దీనిపై మంచి బజ్ క్రియేట్ అయింది.
ఉదయ్ చౌహాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ట్రైలర్ లో చూపించిన కథను గమనిస్తే.. ఇదొక సింపుల్ పాయింట్ చుట్టూ తిరిగే పెద్ద ఎమోషనల్ డ్రామా అని అర్థమవుతుంది. పల్లెటూరిలో ఉండే ఒక వృద్ధుడికి పంటి నొప్పులు లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో డాక్టర్ అతన్ని పల్లబురుసు, అంటే టూత్ బ్రష్ వాడమని సలహా ఇస్తాడు. తన కోసం ఒక బ్రష్ కొనుక్కురారా అని ఆ తండ్రి కొడుకుని అడుగుతాడు.
కానీ ఆ కొడుకు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ తండ్రి, ఒక చిన్న బ్రష్ కోసం ఏకంగా కొడుకు మీదే కోర్టులో కేసు పెడతాడు. వినడానికి ఫన్నీగా ఉన్నా, దీని వెనుక ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉందని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాస్టింగ్ గురించి. బలగం సినిమాతో తమ అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను కంటతడి పెట్టించిన సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.
సుధాకర్ రెడ్డి పల్లెటూరి తండ్రి పాత్రలో జీవించేశాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ అన్నీ చాలా న్యాచురల్ గా, మన పక్కింటి పెద్దాయనను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆయనతో పాటు మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ కూడా కథలో చాలా కీలకంగా ఉండబోతోందని, వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తాయని ట్రైలర్ విజువల్స్ చెబుతున్నాయి.
ఒక చిన్న పాయింట్ ని తీసుకుని దాన్ని పూర్తి స్థాయి సినిమాగా మలచడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడే డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ తన మార్క్ చూపించినట్లు తెలుస్తోంది. కొడుకుపై తండ్రి కేసు వేయడం అనే పాయింట్ స్టార్టింగ్ లో ఒక ఫన్ రైడ్ లాగా అనిపించినా, కథ ముందుకు వెళ్లేకొద్దీ అది ఒక డీప్ ఎమోషనల్ డ్రామాగా మారుతుందని ఆయన చాలా నీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు.
ఈ రూరల్ డ్రామాకు టెక్నికల్ టీమ్ సపోర్ట్ కూడా గట్టిగానే దొరికింది. ముఖ్యంగా పవన్ సీహెచ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ కాబోతోంది. ట్రైలర్ లో ఫన్ సీన్స్ లో ఎంత లైవ్లీగా మ్యూజిక్ ఇచ్చాడో, ఎమోషనల్ సీన్స్ కి వచ్చేసరికి అంతే కనెక్టింగ్ గా స్కోర్ ఇచ్చి ఆయా ఎలిమెంట్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి బ్రాండ్ ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వడంతో ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని విజువల్స్ చూస్తేనే ఇట్టే అర్థమైపోతుంది. మరి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
