పుకార్లపై స్పందించిన పలాశ్.. కఠిన చర్యలు తప్పవంటూ!
అయితే స్మృతి మంధాన పోస్ట్ పెట్టిన తర్వాత పలాశ్ ముచ్చల్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టాడు.
By: Madhu Reddy | 8 Dec 2025 3:31 PM ISTభారత క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లి రద్దయినట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత పలాశ్ ముచ్చల్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టాడు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి ఇంతకీ పలాశ్ ముచ్చల్ తన పోస్టులో ఏం పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం..
స్మృతి మంధాన చాలా రోజుల నుండి వచ్చిన రూమర్లకు తెరదించి.. "నా పెళ్లి రద్దయ్యింది.. ఈ విషయంలో మా గోప్యతని మీరు గౌరవించి, పుకార్లను వ్యాప్తి చేయకండని చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడను.కానీ చెప్పకపోతే మరిన్ని రూమర్స్ వ్యాప్తి చెందుతాయి అనే ఉద్దేశంతోనే ఈ విషయంపై స్పందిస్తున్నాను. దీన్ని ఇక్కడితో ఆపేయండి అంటూ స్మృతి మంధాన తన పోస్టులో తెలిపింది.
అయితే స్మృతి మంధాన పోస్ట్ పెట్టిన తర్వాత పలాశ్ ముచ్చల్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టాడు. "నేను నా జీవితంలో ముందుకు సాగాలని మరియు నా వ్యక్తిగత సంబంధం నుండి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను" అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా స్మృతి మంధానతో పెళ్లి సమయంలో స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో దానికి కారణం పలాశ్ ముచ్చల్ కి ఉన్న ఎఫైరే కారణం అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కూడా ఆయన మౌనం వీడారు..
"నా క్యారెక్టర్ గురించి ఎన్నో నిరాధారమైన పుకార్లు చేస్తున్నారు.ఇలాంటి పుకార్లు పుట్టించడం నాకు చాలా కష్టంగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత కష్టమైన దశ..అలాగే దీని నుండి నేను ధైర్యంగా బయటపడతాను. కానీ నిరాధారమైన పుకార్ల ఆధారంగా ఎవరినైనా జడ్జ్ చెసే ముందు మనం ఒక సమాజంలో బతుకుతున్నామని తెలుసుకోవాలి. కొంతమంది మాటలు మనకు ఎప్పటికీ అర్థంకాని విధంగా గాయపరుస్తాయి.అలాగే మేము ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధగా ఉంది. ప్రపంచంలోనే చాలామంది ఇలాంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారు.తప్పుడు మరియు పరువు నష్టం కలిగించే విషయాలను వ్యాప్తి చేస్తున్న వారిపై నా బృందం కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అంటూ ముచ్చల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టారు.
అలా చాలా రోజుల నుండి తనపై ఫేక్ రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారిపై తన టీం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. అలాగే స్మృతి మంధాన పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాలకే పలాశ్ ముచ్చల్ కూడా తన పెళ్లి రద్దు అయినట్టు తెలిపారు. అయితే పలాశ్ తనపై వచ్చిన ఫేక్ వార్తలపై స్పందించడంతో చాలామంది నెటిజన్లు మరి మీ పెళ్లి ఎందుకు ఆగిపోయింది.. ?అసలు నిజం ఏంటి..?ఎవరు చెప్పలేదుగా..అది నిజం కాకపోతే ఏది నిజం? అంటూ కామెంట్ల రూపంలో అడుగుతున్నారు.. ఇక వీరిద్దరి పెళ్లి రద్దు అవ్వడం వెనుక ఉన్న కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
