స్మృతి మందానతో విడిపోయాక పలాష్ బిగ్ ఛాలెంజ్
7 డిసెంబర్ 2025న స్మృతి మందాన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ పెళ్లి రద్దు అయినట్లు స్పష్టం చేశారు. తమ కుటుంబాల గోప్యతను గౌరవించాలని కోరారు.
By: Sivaji Kontham | 21 Jan 2026 8:15 AM ISTసంగీత దర్శకుడు, దర్శకుడు పలాష్ ముచ్చల్, భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందానతో తన వివాహం రద్దు అయిన తర్వాత మళ్ళీ సినిమాలపై దృష్టి సారించారు. దాదాపు రెండు నెలల విరామం తర్వాత అతడు తన తదుపరి సినిమా ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. పలాష్ ముచ్చల్ తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రలో నటించనున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శ్రేయస్ ఒక సామాన్య వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది పలాష్‌కు దర్శకుడిగా మూడవ సినిమా. గతంలో అర్ధ్, కామ్ చాలు హై చిత్రాలకు దర్శకత్వం వహించారు.
స్మృతి మందాన- పలాష్ ముచ్చల్ ఐదేళ్ల రిలేషన్ షిప్ తర్వాత 23 నవంబర్ 2025న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ చివరి నిమిషంలో అది రద్దయింది. పెళ్లికి కొద్ది గంటల ముందు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో పెళ్లి వాయిదా పడింది. ఆ వెంటనే పలాష్ కూడా తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆసుపత్రిలో చేరారు. అదే సమయంలో పలాష్ ఒక కొరియోగ్రాఫర్‌తో ఎఫైర్ కారణంగా స్మృతిని మోసం చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పలాష్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
7 డిసెంబర్ 2025న స్మృతి మందాన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ పెళ్లి రద్దు అయినట్లు స్పష్టం చేశారు. తమ కుటుంబాల గోప్యతను గౌరవించాలని కోరారు.
ప్రస్తుతం స్మృతి మందాన తన క్రికెట్ కెరీర్‌పై దృష్టి పెట్టగా, పలాష్ ముచ్చల్ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. పలాష్ ఈ వివాదాల నుండి బయటపడి.. తన పని ద్వారానే సమాధానం చెప్పాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. శ్రేయస్ తల్పాడే గతంలో ఇక్బాల్, కౌన్ ప్రవీణ్ తాంబే? వంటి సినిమాల్లో సామాన్య యువకుడిగా అద్భుతంగా నటించారు. కాబట్టి పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో ఆయన చేయబోయే ఈ `కామన్ మ్యాన్` పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. శ్రేయస్ తల్పాడేతో పలాష్ చేస్తున్న ఈ కొత్త సినిమా టైటిల్ ఇతర వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
