పెళ్లైన 12 ఏళ్లకు తల్లైన తెలుగు హీరోయిన్.. పుట్టింది ఎవరంటే?
వివాహబంధంలోకి అడుగుపెట్టిన ప్రతి మహిళకు తల్లి కావడం అనేది ఒక మరచిపోలేని అనుభూతి. కొందరికి ఈ సంతోషం త్వరగానే లభిస్తే, మరికొందరికి ఎంతో కాలం వేచి చూశాక దక్కుతుంది.
By: Madhu Reddy | 26 July 2026 6:16 PM ISTవివాహబంధంలోకి అడుగుపెట్టిన ప్రతి మహిళకు తల్లి కావడం అనేది ఒక మరచిపోలేని అనుభూతి. కొందరికి ఈ సంతోషం త్వరగానే లభిస్తే, మరికొందరికి ఎంతో కాలం వేచి చూశాక దక్కుతుంది. సీనియర్ నటి పద్మప్రియ జానకీరామన్ విషయంలోనూ ఇదే జరిగింది. పెళ్లయిన 12 ఏళ్లకు, 46 సంవత్సరాల వయసులో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డ చిన్ని చేతులను పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె పంచుకున్న శుభవార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ విశేషాలు చూద్దాం..
శీను వాసంతి లక్ష్మితో మొదలైన ప్రయాణం:
ఆర్.పి. పట్నాయక్ హీరోగా 2004లో వచ్చిన 'శీను వాసంతి లక్ష్మి' సినిమాతో పద్మప్రియ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత శర్వానంద్‌తో కలిసి 'అందరి బంధువయా' వంటి చిత్రాలలో నటించి తన సహజ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ, భాషల్లో కూడా విలక్షణమైన పాత్రలతో అలరించి, జాతీయ ఫిల్మ్ అవార్డుతో పాటు కేరళ రాష్ట్ర అవార్డులు, మూడు ఫిలింఫేర్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు.
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రేమ వివాహం:
నటిగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే పద్మప్రియ 2014లో గుజరాత్‌కు చెందిన జాస్మిన్ షాను ముంబైలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా నటనకు స్వస్తి చెప్పకుండా వయస్సుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక ఇటీవల కూడా కొన్ని ప్రాజెక్టులలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె, తన వ్యక్తిగత విషయాలను మాత్రం చాలా ప్రైవేట్‌గా ఉంచడానికి ఇష్టపడతారు.
ప్రెగ్నెన్సీ సీక్రెట్.. సడన్ సర్‌ప్రైజ్:
పద్మప్రియ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని చివరి వరకు ఎక్కడా బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు. సడన్‌గా పండంటి బిడ్డ పుట్టిందంటూ చిన్ని చేతిని పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పటివరకు తనకు పుట్టింది పాపనా లేక బాబానా అనే విషయాన్ని ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. కానీ, పెళ్లయిన 12 ఏళ్లకు తల్లి కావడంపై ఆమె వ్యక్తం చేసిన ఆనందం అందరి హృదయాలను తాకింది.
నెట్టింట వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు:
46 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పద్మప్రియకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. "మీ నిరీక్షణ ఫలించింది.. బిడ్డతో మీ జీవితం మరింత సంతోషంగా సాగాలి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక బిడ్డ చేతిని పట్టుకున్న ఆ క్యూట్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
జీవితంలో సరికొత్త అధ్యాయం:
ఎన్ని అవార్డులు, ప్రశంసలు వచ్చినా తల్లిగా పొందే సంతోషం ముందర అవన్నీ తక్కువేనని పద్మప్రియ ఆనందం చూస్తే అర్థమవుతోంది. దశాబ్ద కాలానికి పైగా వేచి చూసిన ఆ నిరీక్షణకు ఇప్పుడు తియ్యటి ఫలితం దక్కింది. ఇక తల్లిగా సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన పద్మప్రియ జానకీరామన్ దంపతులకు, వారి చిన్నారి(బాబు,పాప )కి మనమూ శుభాకాంక్షలు తెలియజేద్దాం..
