Begin typing your search above and press return to search.

'పాపం ప్రతాప్' టీజర్.. ఇంట్రెస్టింగ్ స్టోరీలా ఉందే!

మొదటి నుండి చివరి వరకు సరదాగా సాగిన టీజర్‌ లో ఎంటర్టైన్మెంట్ తోపాటు ఒక సున్నితమైన అంశాన్ని చూపించినట్లు కనిపిస్తోంది.

By:  M Prashanth   |   25 March 2026 10:34 PM IST
పాపం ప్రతాప్ టీజర్.. ఇంట్రెస్టింగ్ స్టోరీలా ఉందే!
X

టాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో తిరువీర్ మరో కొత్త ఎంటర్టైనర్‌ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మసూద, పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఆయన తాజా చిత్రం పాపం ప్రతాప్ పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఎస్.పీ. దుర్గ నరేష్ దర్శకత్వం వహించగా, ఈటీవీ విన్ ఒరిజినల్స్ నిర్మించింది. తిరువీర్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సమ్మర్ గా కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈటీవీ విన్ టీజర్‌ ను రిలీజ్ చేయగా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

మొదటి నుండి చివరి వరకు సరదాగా సాగిన టీజర్‌ లో ఎంటర్టైన్మెంట్ తోపాటు ఒక సున్నితమైన అంశాన్ని చూపించినట్లు కనిపిస్తోంది. ప్రతాప్ అనే యువకుడు తన చిన్ననాటి ప్రేయసి బుజ్జమ్మను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. స్కూల్ రోజుల్లో ప్రారంభమైన వారి ప్రేమ కథను చాలా మధురంగా చూపించారు. పెళ్లి వరకు అన్నీ బాగానే సాగుతాయి. అయితే పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో చూడాలని బుజ్జమ్మ చెప్పడం కథలో కీలక మలుపుగా నిలుస్తుంది.

పెళ్లి అయిన తర్వాత మొదటి మూడు రోజులు సజావుగా గడుస్తాయి. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. బుజ్జమ్మ పంచాయతీకి వెళ్లి ప్రతాప్‌ పై ఫిర్యాదు చేయడం కథలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో గ్రామస్థులంతా ప్రతాప్‌ లో ఏదైనా లోపం ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఆ సందేహాల మధ్య అసలు సమస్య ఏమిటి? బుజ్జమ్మ ఎందుకు అలా చేసింది? ప్రతాప్ జీవితంలో ఏమి జరిగిందన్నది చిత్రంలో సస్పెన్స్‌ గా ఉంచారు.

ఆ అంశాన్ని దర్శకుడు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ చెప్పే ప్రయత్నం చేసినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. సినిమాలో గ్రామీణ వాతావరణం, నేచురల్ రోల్స్, ఫన్నీ కన్వర్జేషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. కామెడీతో పాటు ఎమోషన్స్ ను కూడా మేకర్స్ యాడ్ చేసినట్లు టీజర్ చెప్పకనే చెబుతోంది. ఏదేమైనా పాపం ప్రతాప్ మూవీ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనునట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా ప్రతాప్ పాత్రలో తిరువీర్ యాక్టింగ్ నేచురల్ గా కనిపిస్తుండగా, బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ తన పాత్రకు న్యాయం చేసినట్లు టీజర్‌ లో స్పష్టమవుతోంది. మొత్తానికి పాపం ప్రతాప్ సాధారణ ప్రేమకథగా ప్రారంభమై, పెళ్లి తర్వాత జరిగే పరిణామాలతో ఇంట్రెస్టింగ్ స్టోరీగా కనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్, ప్రేమ, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చిత్రం ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.