రిలీజైన వారానికే ఓటీటీలోకి.. అక్కడైనా హిట్ చేస్తారా?
టాలీవుడ్ సినిమాలు థియేటర్స్ లో విడుదల అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి.
By: M Prashanth | 28 Nov 2025 3:50 PM ISTటాలీవుడ్ సినిమాలు థియేటర్స్ లో విడుదల అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. నాలుగు నుంచి ఆరు వారాల మధ్య స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు.. నెలకన్నా తక్కువ రోజుల్లోపే ఓటీటీ లవర్స్ కు అందుబాటులోకి వస్తుంటాయి. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన వారానికే ఓటీటీలోకి రావడం చర్చనీయాంశంగా మారింది. బహుశా ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదేమో.
అదేం సినిమా అంటే.. పాంచ్ మినార్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఆ మూవీలో యంగ్ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్ లో నటించారు. రాశీ సింగ్ హీరోయిన్ గా నటించగా.. రామ్ కుడుముల దర్శకత్వం వహించారు. బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎం ఎస్ ఎం రెడ్డి రూపొందించారు.
అయితే గత వారం అంటే.. నవంబర్ 21వ తేదీన థియేటర్స్ లో విడుదలైన పాంచ్ మినార్ మూవీ.. సడెన్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. వారం రోజుల్లోనే ఓటీటీలోకి రావడంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. మరీ తక్కువ గ్యాప్ లో ఎందుకు స్ట్రీమింగ్ చేశారోనని మాట్లాడుకుంటున్నారు.
నిజానికి పాంచ్ మినార్ చిన్న పాయింట్ తో రూపొందినా.. డీసెంట్ టాక్ అందుకుంది. క్రిటిక్స్ కు నచ్చడంతో పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. సినిమా పర్లేదని అనేక మంది రివ్యూ ఇచ్చారు. రాజ్ తరుణ్ కొంతకాలంగా చేస్తున్న సినిమాల కన్నా పాంచ్ మినార్ బాగుందని కూడా చెప్పారు. కానీ సినిమా మాత్రం థియేటర్స్ లో నిలబడలేదు.
అందుకు ముఖ్య కారణం.. సినిమా ఆడియన్స్ కు రీచ్ అవ్వకపోవడం. ఎందుకంటే థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయినా.. చాలా మందికి ఆ విషయం తెలియదు. ప్రమోషన్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అసలు ఆ సినిమా వచ్చిందా అని ఇప్పుడు కొందరు నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. తమకు రిలీజ్ అయిన విషయం కూడా తెలియదని అంటున్నారు.
ప్రమోషన్స్ లేకపోవడం మూవీకి పెద్ద మైనస్. లేకుంటే అందరికీ రీచ్ అయ్యి క్లిక్ అయ్యేది. రాజ్ తరుణ్ కు మంచి హిట్ దక్కేది. వరుస ప్లాపులతో సతమవుతున్న ఊరటనిచ్చేది. కానీ సినిమా బాగున్నా.. క్రిటిక్స్ కు నచ్చినా.. పబ్లిసిటీ లేక.. రీచ్ అవ్వక... థియేటర్స్ లో నిలబడక వారానికే ఓటీటీలోకి వచ్చింది. అయితే థియేటర్స్ లో రెస్పాన్స్ లేకపోయినా.. ఓటీటీలోకి వచ్చి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మరి ఓటీటీ ఆడియన్స్.. పాంచ్ మినార్ విషయంలో ఏం చేస్తారో చూడాలి.
