పా రంజిత్ 'వెట్టువం'.. ఈసారి ప్లాన్ ఎలా ఉందంటే..
ఆర్య, అట్టకత్తి దినేష్, శోభితా ధూళిపాళ తదితరులు నటిస్తున్న ఆ సినిమా నుంచి వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో రిలీజైన ఇంట్రడక్షన్ వీడియో సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచుతోంది.
By: M Prashanth | 18 Sept 2026 1:25 PM ISTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ అంటేనే వైవిధ్యమైన కథలు, స్ట్రాంగ్ రోల్స్, కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నాలు గుర్తొస్తాయి. మద్రాస్, కబాలి, సార్పట్ట పరంపర, తంగలాన్ వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన ఆయన.. ఇప్పుడు మరో సరికొత్త ప్రయత్నంతో వస్తున్నారు. అదే వెట్టువం. ఆర్య, అట్టకత్తి దినేష్, శోభితా ధూళిపాళ తదితరులు నటిస్తున్న ఆ సినిమా నుంచి వరల్డ్ ఆఫ్ వెట్టువం పేరుతో రిలీజైన ఇంట్రడక్షన్ వీడియో సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచుతోంది.
ఈసారి పా. రంజిత్ కథను ఒకే కాలంలో చెప్పడం లేదు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్.. ఇలా మూడు టైమ్ లైన్స్ మధ్య కథను నడిపించనున్నారు. అప్పటి కాలంలో ప్రజల లైఫ్ స్టైల్, వారి కల్చర్ ఎలా ఉండేదనేది ఒక యాంగిల్ లో చూపించనున్నారు. ఆ కాలం ఎఫెక్ట్ నేటి సమాజంపై ఎలా ఉందనేది ప్రెజెంట్ లో చూపించనున్నారు. ఇక ప్రకృతి విపత్తుల తర్వాత ఫ్యూచర్ లో వరల్డ్ ఎలా మారుతుందనేది మరో కీలకమైన భాగంగా ఉండనుంది.
అంటే.. ఒక కాలానికి సంబంధించిన స్టోరీ మాత్రమే చెప్పకుండా, మూడు కాలాలను కలిపి ఒక పెద్ద వరల్డ్ ను క్రియేట్ చేసేందుకు రంజిత్ ట్రై చేస్తున్నారన్నమాట. ప్రపంచంలో అధికారం కోసం జరిగే పోరాటం మెయిన్ ఎలిమెంట్ గా కనిపిస్తోంది. డామినేషన్ కోసం వేర్వేరు తెగలు, వర్గాల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ కథ తిరగనుంది. ఇంద్ర విళా వేడుకలో ప్రజల నాయకుడిని ఎన్నుకునే పోటీ కూడా కథలో కీలకంగా ఉండనున్నట్లు గ్లింప్స్ లో రివీల్ చేశారు.
ఇక యాక్షన్ విషయంలో పా. రంజిత్ కొత్త దారిలో వెళ్తున్నారు. సాధారణ ఫైట్ సీన్లకు బదులుగా సంప్రదాయ యుద్ధ కళలు ఉపయోగించారు. తమిళనాడుకు చెందిన అడిమురైతో పాటు మాల్కమ్ వంటి యుద్ధ విద్యల్లో క్యాస్టింగ్ కు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. వర్క్ షాప్ ల తర్వాతే యాక్షన్ సీన్స్ లో నటించినట్లు తెలుస్తోంది. దీంతో ఫైట్స్ కూడా చాలా నేచురల్ కనిపించేలా ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.
ఇంట్రడక్షన్ వీడియోలో లీడ్ రోల్స్ కు సంబంధించిన వివరాలను చూపించారు. ఆర్య ధర్మరాజన్ గా, షబీర్ కల్లరక్కల్ సెంబియన్ గా, కలైయరసన్ వీరవర్మన్ గా, శోభితా ధూళిపాళ రాధిగా, అట్టకత్తి దినేష్ నంధన్ గా కనిపించనున్నారు. ప్రతి రోల్ కు స్పెషల్ బ్యాక్ డ్రాప్ ఉండేలా కథను సిద్ధం చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా స్ట్రెంత్ చేకూర్చేలా ఉంది.
భారీ సెట్లు, రా అండ్ రస్టిక్ విజువల్స్, యాక్షన్ సీన్స్ తో వెట్టువం ఒక కొత్త వరల్డ్ ను చూపించేందుకు సిద్ధమవుతోంది. నీలం ప్రొడక్షన్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్ కలిసి ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 2026లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలా రంజిత్ ఈసారి సోషల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, సైన్స్ ఫిక్షన్, ఫ్యూచర్ వరల్డ్, అధికారం కోసం పోరాటం వంటి ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నారు.
