Begin typing your search above and press return to search.

'కాంతార' హిట్.. పా.రంజిత్ ఫైర్.. ఆ 600 సినిమాల సంగతేంటి?"

రంజిత్ రజినీకాంత్‌తో తీసిన 'కబాలి' గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడారు. "'కబాలి' స్క్రీన్‌ప్లేలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నా.

By:  M Prashanth   |   26 Oct 2025 9:08 PM IST
కాంతార హిట్.. పా.రంజిత్ ఫైర్.. ఆ 600 సినిమాల సంగతేంటి?
X

'బైసన్' సినిమా సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ ప్రొడ్యూసర్ పా. రంజిత్ చాలా హ్యాపీగా ఉండాల్సింది. ఎందుకంటే, మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో తను ప్రొడ్యూస్ చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, రంజిత్ మాత్రం స్టేజ్ మీద చాలా ఫ్రస్ట్రేటెడ్‌గా, సీరియస్‌గా కనిపించారు. ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి.

అసలు పాయింట్ ఏంటంటే, 'కాంతార' లాంటి రూటెడ్ సినిమాలు (మన నేల, మన సంస్కృతి, దైవం) బ్లాక్‌బస్టర్ అయిన ప్రతీసారీ, కొంతమంది తమిళ్ ఆడియెన్స్ సోషల్ మీడియాలో పా. రంజిత్, మారి సెల్వరాజ్ లాంటి మరో ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లను టార్గెట్ చేస్తున్నారట. "తమిళ్ సినిమా ఇమేజ్‌ను మీరే చెడగొడుతున్నారు. మీరు ఇలాంటి సినిమాలు తీస్తూ ఇండస్ట్రీని నాశనం చేశారు" అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారట. ఈ విమర్శల మీదే రంజిత్ గట్టిగా రియాక్ట్ అయ్యారు.

"గత రెండేళ్లలో 600కు పైగా తమిళ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మీరంటున్న సినిమాలు తీసింది మేము ముగ్గురమే. సరే, మేమే ఇండస్ట్రీని చెడగొట్టాం అనుకుందాం. మరి మిగిలిన సినిమాల సంగతేంటి? ఆ 600 సినిమాల్లో ఎన్ని సినిమాలు తమిళ్ సినిమా స్థాయిని నిజంగా పెంచాయి? మమ్మల్ని పక్కనపెట్టండి, ఆ మిగిలిన వాళ్లు ఏం చేశారు?" అని రంజిత్ సూటిగా ప్రశ్నించారు.

ఇక్కడ అసలు ప్రాబ్లమ్ 'మంచి సినిమా vs చెడ్డ సినిమా' కాదు. ప్రాబ్లమ్ 'కంఫర్టబుల్ సినిమా vs అన్‌కంఫర్టబుల్ సినిమా' అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'కాంతార' కూడా రూటెడ్ సినిమానే, కానీ అది దైవం, మన సంస్కృతిని హైలెట్ చేసింది. అది చూడటానికి అందరికీ 'కంఫర్టబుల్‌'గా ఉంటుంది. కానీ రంజిత్, మారి సెల్వరాజ్ సినిమాలు సమాజంలోని కుల వివక్ష, అణచివేత వంటి విషయాలను చూపిస్తాయని వారికి మద్దతు ఇచ్చేవారు చెబుతున్నారు.

రంజిత్ రజినీకాంత్‌తో తీసిన 'కబాలి' గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడారు. "'కబాలి' స్క్రీన్‌ప్లేలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఆ సినిమా రిలీజ్‌కు ముందే 100 కోట్లు లాభం తెచ్చింది" అని క్లారిటీ ఇచ్చారు. అంటే, తన కమర్షియల్ సినిమాలో లోపాలున్నా, 'బైసన్' లాంటి తన సినిమాలపై, తన సిద్ధాంతంపై వస్తున్న విమర్శలను మాత్రం ఆయన అస్సలు తీసుకోలేకపోతున్నారని మరికొందరు చెబుతున్నారు.