Begin typing your search above and press return to search.

జూన్ మూడో వారంలో ఓటీటీలో సందడి చేయబోయే చిత్రాలివే!

వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే బ్యాచ్ ఒకవైపు ఉంటే ..ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే కూర్చొని ఓటీటీ లలో సినిమాలు చూసే బ్యాచ్ మరోవైపు..

By:  Madhu Reddy   |   17 Jun 2026 2:54 PM IST
జూన్ మూడో వారంలో ఓటీటీలో సందడి చేయబోయే చిత్రాలివే!
X

వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసే బ్యాచ్ ఒకవైపు ఉంటే ..ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే కూర్చొని ఓటీటీ లలో సినిమాలు చూసే బ్యాచ్ మరోవైపు.. అందుకే ఎవరికి తగ్గట్టుగా వారి అభిరుచులను దృష్టిలో పెట్టుకొని అటు క్రియేటర్స్ కూడా మంచి మంచి కథలను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లలో మెప్పించిన చాలా సినిమాలు ఇటు ఓటీటీలలో కూడా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ప్రత్యేకించి జూన్ మూడవ వారం టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు ఎన్నో చిత్రాలు, సిరీస్ లు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాయి. మరి జూన్ మూడవ వారంలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్న ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్: హాలీవుడ్ వెబ్ సిరీస్ ల నుండి కొరియన్ మూవీ వరకు..

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం అదిరిపోయే వెబ్ సిరీస్ లతో పాటు కొరియన్ మూవీ కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం కాబోతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే మై అమెరికాస్ స్వీట్ హార్ట్స్ సీజన్ 3 స్ట్రీమింగ్ కి రాగా.. హాలీవుడ్ మూవీ డ్రింకింగ్ బడ్డీస్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక జూన్ 18న ఐ విల్ ఫైండ్ యు హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుండగా.. మరొకవైపు జూన్ 19న హాలీవుడ్ మూవీ వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసబెల్లే స్ట్రీమింగ్ కి రాబోతోంది. అంతేకాదు కొరియన్ మూవీ హస్బెండ్స్ ఇన్ యాక్షన్ జూన్ 19న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి రాబోతోంది. అలాగే అదే రోజు తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కి రానుంది.

దృశ్యం 3తో సందడి చేయనున్న అమెజాన్ ప్రైమ్..

మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ దృశ్యం ఫ్రాంచైజీలో భాగంగా మలయాళ మూవీ దృశ్యం 3 జూన్ 18న అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. హాలీవుడ్ మూవీ యువర్ ఫాల్ట్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అలాగే 21న ది ఎజెన్సీ సీజన్ 2 వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

సేవ్ ది టైగర్స్ 3తో మళ్లీ జోరందుకున్న జియో హాట్ స్టార్..

నవ్వులు పువ్వులు పూయిస్తూ ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సేవ్ ది టైగర్స్ ఇప్పుడు మూడవ సీజన్ కి సిద్ధమైంది. జూన్ 19న జియో హాట్ స్టార్ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది. ఇక ఈ సీజన్ 3లో వెన్నెల కిషోర్ యాడ్ అయ్యారు. ఇక అలాగే మరోవైపు యోగిబాబు ఫుల్ అండ్ ఫుల్ కామెడీ మూవీ కెనతా కానోమ్ కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

వీటితోపాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లయన్స్ గేట్ ప్లే లో బాలీవుడ్ మూవీ అలియా బసు గాయబ్ హై అనే చిత్రం జూన్ 19, తెలుగు సినిమా మోటివ్ ఫర్ మర్డర్ కూడా జూన్ 19న స్ట్రీమింగ్ కి రానున్నాయి. ఇక ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ సోనీ లీవ్ వేదికగా జూన్ 19న మలయాళ సినిమా అతిరథి కూడా స్ట్రీమింగ్ కి రాబోతోంది.