ఓటీటీ vs థియేటర్.. జేబుకు చిల్లు పడేది ఎక్కడ?
ఓటీటీ అంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందని మనలో చాలా మంది ఫీలింగ్. మొబైల్ లో రీఛార్జ్ ఉంటే చాలు, ఇంట్లో కూర్చుని ఎన్ని సినిమాలైనా చూసేయొచ్చు అనుకుంటాం. కానీ, అసలు లెక్కలు వేసి చూస్తే గానీ తెలియడం లేదు.
By: M Prashanth | 21 Jan 2026 6:00 AM ISTఓటీటీ అంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందని మనలో చాలా మంది ఫీలింగ్. మొబైల్ లో రీఛార్జ్ ఉంటే చాలు, ఇంట్లో కూర్చుని ఎన్ని సినిమాలైనా చూసేయొచ్చు అనుకుంటాం. కానీ, అసలు లెక్కలు వేసి చూస్తే గానీ తెలియడం లేదు.. మనం ఓటీటీల కోసం వెచ్చిస్తున్న సొమ్ము థియేటర్ కి వెళ్లే బడ్జెట్ కంటే ఎక్కువవుతోందని. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, నేటి పరిస్థితుల్లో ఇది నిజం.
ఒకసారి మన సబ్‌స్క్రిప్షన్ల లిస్టు చూద్దాం. జియో హాట్‌స్టార్ ఏడాదికి సుమారు 2,199 రూపాయలు, అమెజాన్ ప్రైమ్ 2,198 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇక క్వాలిటీగా సినిమా చూడాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఏడాదికి సుమారు 5,988 రూపాయలు అవుతుంది. దీనికి తోడు ఇంటర్నెట్ బిల్లులు, వైఫై లేదా మొబైల్ డేటా కోసం ఏడాదికి కనీసం 3,600 నుండి 12,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నాం.
అంటే, కేవలం ఈ మూడు ప్లాట్‌ఫారమ్స్ అలాగే ఇంటర్నెట్ కోసం ఒక ఫ్యామిలీ ఏడాదికి కనీసం 20 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. ఒక నలుగురు సభ్యులున్న ఫ్యామిలీ ఏడాదికి 10 నుండి 15 పెద్ద సినిమాలకు థియేటర్లకు వెళ్లినా కూడా దాదాపు ఇదే అమౌంట్ ఖర్చవుతుంది. ఇక్కడ టికెట్ రేట్లు, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిపి చూసినా కూడా ఓటీటీ ప్యాకేజీల ఖర్చుతో సమానంగా ఉండటం గమనార్హం.
ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓటీటీలో వేల సినిమాలు ఉన్నా మనం నెలలో ఎన్ని చూస్తున్నాం అనేది పాయింట్. కేవలం వీకెండ్స్ లో మాత్రమే సినిమాలను చూసే వారికి, ఇలా అన్ని ప్లాట్‌ఫారమ్స్ మెయింటైన్ చేయడం ఆర్థికంగా భారమే. ఏదో ఒక సినిమా కోసమో లేదా వెబ్ సిరీస్ కోసమో ఏడాది పొడవునా సబ్‌స్క్రిప్షన్లు కట్టడం వల్ల జేబుకు చిల్లు పడుతోంది. పైగా మల్టిపుల్ యాప్స్ ఉండటం వల్ల ప్రతి దానికీ విడివిడిగా పే చేయాల్సి వస్తోంది.
కానీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే కిక్ వేరు. బిగ్ స్క్రీన్ మీద పది మంది మధ్యలో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఆ వైబ్ ఇంట్లో అస్సలు దొరకదు. పండగ వాతావరణంలో ఫ్యామిలీతో బయటకు వెళ్లి సినిమా చూసి రావడంలో ఉండే ఆ హ్యాపీనెస్ వేరు. ఓటీటీలో కంఫర్ట్ ఉన్న మాట నిజమే అయినా, ఆర్థిక పరంగా చూస్తే మాత్రం అది ఇప్పుడు ఒక ఖరీదైన లగ్జరీగా మారుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న సబ్‌స్క్రిప్షన్ ధరలే దీనికి మెయిన్ రీజన్.
ఫైనల్ గా ఓటీటీ అంటే 'చీప్ అండ్ బెస్ట్' అనే రోజులు పోయాయి. ఇన్ని రకాల యాప్స్, ఇంటర్నెట్ బిల్లులు కలిపితే అది థియేటర్ బడ్జెట్‌ను మించిపోతోంది. అందుకే స్మార్ట్ గా ఆలోచించే వారు కేవలం తమకు నచ్చిన కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే నెలవారీ ప్లాన్స్ తీసుకుంటున్నారు. మొత్తానికి ఓటీటీ కంటే థియేటర్ ఎక్స్‌పీరియన్సే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తోంది.
