Begin typing your search above and press return to search.

ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, సిరీస్ లు ఇవే.. వాటిని మాత్రం మిస్ అవ్వకండి!

మరి ఈ వారం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన సినిమాలు, సీరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

By:  Madhu Reddy   |   7 Aug 2025 7:04 PM IST
ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, సిరీస్ లు ఇవే.. వాటిని మాత్రం మిస్ అవ్వకండి!
X

ఎప్పటిలాగే ఈవారం కూడా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించడానికి పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు సిద్ధం అయిపోయాయి. అందులో ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ కి రాగా, మరికొన్ని సిద్ధం అవుతున్నాయి. అయితే అందులో ప్రత్యేకించి ఆ చిత్రాలను మాత్రం అసలు మిస్ అవ్వకండి అని థియేటర్లలో సినిమా చూడలేని వారికి.. సినిమా చూసినవారు సలహా ఇస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన సినిమాలు, సీరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మయసభ..

ఆది పినిశెట్టి , చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ 'మయసభ' ఓటీటీ సోనీలివ్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా ఇద్దరి స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు? అనే విషయాన్ని తెరపై చూపిస్తూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించినట్లు ట్రైలర్ లోనే వెల్లడించిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా ఇద్దరు బడా నేతల గురించి, వారి స్నేహం గురించి.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రత్యర్ధులుగా ఎలా మారారు.. అనే విషయాలు తెలియాలి అంటే కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ఓహో ఎంథన్ బేబీ..

కృష్ణ కుమార్ దర్శకత్వంలో రుద్ర, మిథిలా పాల్కర్ కీలక పాత్రలో వచ్చిన చిత్రం 'ఓహో ఎంథన్ బేబీ'. తమిళ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

సలాకార్: ది లెజెండ్ ఆఫ్ యాన్ ఎక్స్ టార్డినరీ ఇండియన్ స్పై..

ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన మరో స్పై థ్రిల్లర్ మూవీ ' సలాకార్: ది లెజెండ్ ఆఫ్ యాన్ ఎక్స్ టార్డినరీ ఇండియన్ స్పై'. ఆగస్టు 8వ తేదీ నుంచి హిందీతో పాటు తెలుగు లో కూడా జియో హాట్ స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఇందులో మౌని రాయ్ , నవీన్ కస్తూరియా ప్రధాన పాత్రలు పోషించగా.. ఫరూక్ కబీర్ దర్శకత్వం వహించారు.

బద్మాషులు:

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపూడి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో 'బద్మాషులు' అనే సినిమా తెరకెక్కించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కామెడీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ యాప్ వేదికగా ఓటీటీలో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఇక ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాలతో పాటు..

నెట్ ఫ్లిక్స్:

స్టోలెన్ : హీస్ట్ ఆఫ్ ది సెంచరీ (వెబ్ సిరీస్) - ఆగస్టు 8

వెన్స్ డే సీజన్ 2 (పార్ట్ వన్) - స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ :

అరేబియా కడలి (వెబ్ సిరీస్) - ఆగస్టు 8

ది పికప్ ఫీచర్ (ఇంగ్లీష్ ) - స్ట్రీమింగ్ అవుతోంది

జియో హాట్ స్టార్:

లవ్ హార్ట్స్ (హాలీవుడ్) - ఆగస్టు 7

మిక్కీ (హాలీవుడ్ ) - ఆగస్టు 7

జీ ఫైవ్ :

మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు సిరీస్) - ఆగస్టు 8

మామన్ (తమిళ్ మూవీ ) - ఆగస్టు 8.