వీకెండ్ స్పెషల్ .. సమ్మర్ వేళ కూల్ చిత్రాలు!
కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ హవా బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి ఓటీటీలు కూడా సిద్ధం అయిపోయాయి.
By: Madhu Reddy | 2 May 2026 11:30 PM ISTకరోనా వచ్చిన తర్వాత ఓటీటీ హవా బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడానికి ఓటీటీలు కూడా సిద్ధం అయిపోయాయి. నిత్యం ఏదో ఒక జానర్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. టీవీలకే కట్టిపడేస్తూ అటు టీఆర్పీ రేటింగ్ లో కూడా దూసుకుపోతున్నాయి. ఇకపోతే మిగతా రోజులు ఒక ఎత్తు అయితే.. ఈ సమ్మర్ హాలిడేస్ మరో ఎత్తు. అందుకే సమ్మర్ హాలిడేస్ ను మరింత క్యాష్ చేసుకోవడానికి అటు చిన్న హీరోలను మొదలుకొని పెద్ద హీరోల వరకు థియేటర్లలో సందడి చేస్తుంటే.. మరొకవైపు ఓటీటీలు కూడా భిన్న విభిన్నమైన జానర్లలో సినిమాలను స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నాయి.
ఇకపోతే ప్రత్యేకించి వీకెండ్ స్పెషల్ సందర్భంగా ఓటీటీలోకి సమ్మర్ వేళ.. ఆడియన్స్ ను చిల్ చేయడానికి అదిరిపోయే సినిమాలు మన ముందుకు వచ్చాయి. మరి ఏ ప్లాట్ ఫామ్ లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి సిరీస్ ని ఏ ప్లాట్ఫారంలో చూడవచ్చు అనే విషయం ఇప్పుడు చూద్దాం.
నెట్ ఫ్లిక్స్: స్పోర్ట్స్ డ్రామా నుంచి ఫాంటసీ కామెడీ వరకూ..
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్పోర్ట్స్ డ్రామా మొదలుకొని ఫాంటసీ కామెడీ వరకు ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఇండియాస్ ఫస్ట్ మోటో క్రాస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ బైకర్ మూవీ ఇప్పుడు మే 1వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రాజశేఖర్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రేసింగ్ కీ, కన్నతండ్రికీ కొన్నాళ్లు దూరంగా గడిపిన హీరో మళ్ళీ ట్రాక్ పైకి రావాలనుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఎలాంటివి? తండ్రి కొడుకులు మళ్ళీ కలిశారా ? లేదా? అనేదే కథ.
మరోవైపు ఫాంటసీ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాకాస. సంగీత్ శోభన్ , నయన్ సారిక, గెటప్ శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాను మానస శర్మ దర్శకత్వం వహించగా.. నిహారిక నిర్మించారు. ఈ సినిమా కూడా బైకర్ మూవీకి పోటీగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది . ఇప్పుడు ఈ సినిమా కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా చిత్రాలే కాదు సిరీస్ లు కూడా సిద్ధమయ్యాయి. గ్లోరీ, మ్యాన్ ఆన్ ఫైర్, మై డియరెస్ట్ సెనోరిటా, స్వాప్డ్ వంటి సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.
జీ 5: తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టి ఇబ్బందుల పడ్డ ముగ్గురమ్మాయిల కథ..
ది కేరళ స్టోరీ సినిమాకి సీక్వెల్ గా రూపొందించిన ది కేరళ స్టోరీ 2 సినిమా జీ 5 వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చింది. తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టి.. ప్రేమించిన వారికి వెళ్ళిన ముగ్గురు అమ్మాయిల పరిస్థితి ఏంటి? అనేది ఈ సినిమా కథ. ఆడు 3 సినిమా కూడా ఈ సమ్మర్ వేళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.
జియో హాట్ స్టార్: కాలేజ్ రోజులను గుర్తు చేసే బ్యాచ్ మేట్స్..
కాలేజీ రోజులంటే మనకు ఎన్నో జ్ఞాపకాలు.. ఫ్రెండ్స్ తో అల్లరి, ప్రేమ, క్లాసులు , బంక్ కొట్టడం సీనియర్లతో గొడవ.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో సరదాలు, అపోహలు, గొడవలు. ముఖ్యంగా చిన్న క్షమాపణలతో ప్రొఫెసర్ల దగ్గర నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. కానీ కొందరు బ్యాచ్ మేట్స్ తొలిసారి సస్పెండ్ అయిన స్టూడెంట్స్ గా కాలేజీ 20 ఏళ్ల చరిత్రలో రికార్డు సృష్టించారు . ఈ కథాంశంతో రూపొందిన సిరీస్ బ్యాచ్ మేట్స్. ప్రస్తుతం జియో హాట్ స్టార్ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.
సోనీ లైవ్: రెండేళ్లయినా తగ్గని క్రేజ్ తో పోర్ తొళిల్..
క్రైమ్ థ్రిల్లర్ గా ఒక సైకో కిల్లర్ వరుస సీరియల్ హత్యలతో క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగే చిత్రం పోర్ తొళిల్.. తమిళ్ మూవీ గా 2023 లోనే స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా మంచి టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంటూ ఆడియన్స్ కి మంచి థ్రిల్ అందిస్తోంది.
