కోట్ల రూపాయలు కాదు కంటెంట్ ముఖ్యం!
ఓ చిన్న సినిమాను తీసుకుంటే? మినిమం బడ్జెట్ 5 కోట్లుగా తేలింది. ఐదు కోట్ల నుంచి 20-30 కోట్ల మధ్యలో చాలా సినిమాలు నిర్మాణం అయ్యాయి.
By: Srikanth Kontham | 25 Dec 2025 5:00 AM ISTసినిమా అంటే ఇప్పుడు బడ్జెట్ ఎంత? ఎన్ని కోట్లు పెడుతున్నారు? అది పదుల్లో ఉందా? వందల్లో ఉందా? ఇలా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. తెలుగు సినిమా పాన్ ఇండియాలో సక్సస్ అయిన తర్వత బడ్జెట్ స్పాన్ కూడా అంత కంతకు పెరిగిపోవడం మిగతా సినిమాలపై కూడా ఆప్రభావం పడిందన్నది కాదనలేని నిజం.బడ్జెట్ ని బట్టి సినిమా స్థాయిని డిసైడ్ చేస్తున్నారంతా. కథ ఎలా ఉంది? అన్నది కూడా బడ్జెట్ ని చూసి చెప్పేస్తున్నారు. దర్శక, రచయితల్ని నిర్మాతలు అంతే సులువుగా నమ్మిస్తున్నారు. ఊహాల్లో మునగ చెట్టు ఎక్కించి రిలీజ్ తర్వాత ఒక్కసారిగా కిందకు వదిలేస్తున్నారు.
ఈ బడ్జెట్ మోజులో పడి చాలా మంది కంటెంట్ పై దృష్టి పెట్టడం లేదని కొంత మంది నిర్మాతల నుంచి వినిపిస్తోన్న వాదన. నిజమే? కంటెంట్ విషయంలో జాగ్రత్తపడే వారు అతికొద్ది మందే కనిపిస్తున్నారు. ఎంత బలమైన కంటెంట్ ను పేపర్ పై పెట్టామని రివ్యూ చేసుకునేవారి సంఖ్య తగ్గిపోతుంది. ఉదాహారణకు 2025 సినిమాలే తీసుకుంటే? టాలీవుడ్ సక్సస్ రేట్ చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఎక్కవ వైఫల్యం చెందాయని రివ్యూ చేస్తే కంటెంట్ వైఫల్యమే తెరపైకి వచ్చింది. మరి ఆ సినిమాల బడ్జెట్ చూస్తే మాత్రం భారీగానే ఖర్చు చేసారు.
ఓ చిన్న సినిమాను తీసుకుంటే? మినిమం బడ్జెట్ 5 కోట్లుగా తేలింది. ఐదు కోట్ల నుంచి 20-30 కోట్ల మధ్యలో చాలా సినిమాలు నిర్మాణం అయ్యాయి. 30 కోట్ల నుంచి 50 కోట్లు-70 కోట్ల మధ్యలో మరికొన్నిసినిమాలు నిర్మాణం అయ్యాయి. ఇవి టైర్ 2, టైర్ 3 కేటగిరి కిందకు వస్తాయి. వాటి సక్సెస్ రేట్ చూస్తే? మాత్రం నిర్మాతల లాభాల సంగతి పక్కన బెట్టు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తేలేకపోయాయి. ఓటీటీ డీల్స్ తో గట్టెక్కిన చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. మరికొన్ని చిత్రాల విషయంలో ఓటీటీలు కూడా ఆదుకోలేకపోయాయి. కంటెంట్ పై డౌట్ తో? కొన్ని ఓటీటీలు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్లనూ లేదు.
తోచినంత ఇచ్చి చేతులు దులుపుకున్నారు అన్నది తెరపైకి వచ్చింది. ఇంతటి పరిస్థితికి ప్రధాన కారణం ఏంటి? అంటే కంటెంట్ లో వైఫల్యం మాత్రమే. బలమైన కంటెంట్ అయితే థియేటర్లోనే రిలీజ్ అవ్వాల్సిన పనిలేదు. ఎదురు డబ్బులిచ్చి ఓటీటీలే రిలీజ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఓటీటీలు రెండు రకాల బిజినెస్ స్ట్రాటజీని అనుసరించి ముందుకెళ్తున్నాయి. నిర్మాతలకు ఇక్కడ థియేట్రికల్ బిజినెస్ పరంగా పెద్దగా లాభం రానప్పటికీ ఆ ప్రాపిట్ ఓటీటీ ఒప్పందంలో చూపిస్తున్నారు. నిర్మాతలు ఇలా ఓటీటీలపై ఆధారపడటంతోనే థియేట్రికల్ రిలీజ్ విషయంలోనూ ఓటీటీల ఆధిపత్యం కనిపిస్తోందన్నది వాస్తవం.
