సినిమా రిలీజ్ లో ఓటీటీలే గేమ్ ఛేంజర్.. అంతా వాళ్ల చేతుల్లోనే
అదే ఓటీటీ డీల్ పూర్తైతే.. బొమ్మ థియేటర్లలో పడి ఫెయిల్ అయినా.. కొద్దో గొప్పొ బడ్జెట్ కవర్ చేసుకునే అవకాశం ఉంటుందని. దీంతో ఓటీటీలు కూడా మేకర్స్ కు సవాలక్ష షరతులు విధిస్తున్నాయి.
By: M Prashanth | 2 Oct 2025 8:00 AM ISTప్రస్తుతం సినిమా మేకింగ్ లో ఓటీటీ డీల్స్ ది కీలక పాత్ర ఉంటుంది. సినిమా పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ తోనే మేకర్స్ ఓటీటీ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. అలా సినిమాపై అంచనాలు పెంచేసి వీలైనంత మంచి రేటుకు ఓటీటీలకు అమ్మేస్తున్నాయి. ఇదంతా సినిమా రిలీజ్ కు ముందు షూటింగ్ సమయంలోనే జరిగిపోతుంది. వాళ్లతో డీల్ కుదుర్చుకోవడం కోసం మేకర్స్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకవిధంగా ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్నాకే సినిమా రిలీజ్ పెట్టుకుంటున్నారు. లేదంటే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ధైర్యం చేయడం లేదు. ఏందుకంటే ఫలితం తేడా కొడితే పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అదే ఓటీటీ డీల్ పూర్తైతే.. బొమ్మ థియేటర్లలో పడి ఫెయిల్ అయినా.. కొద్దో గొప్పొ బడ్జెట్ కవర్ చేసుకునే అవకాశం ఉంటుందని. దీంతో ఓటీటీలు కూడా మేకర్స్ కు సవాలక్ష షరతులు విధిస్తున్నాయి.
అటు మేకర్స్ కూడా చేసేదేమీ లేక వాళ్ల పెట్టిన రూల్స్ కు తలొగ్గాల్సి వస్తోంది. ఇక సినిమా షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ.. అది థియేటర్లకు రాలేదంటే, ఓటీటీ డీల్ కాలేదని అర్థం చేసుకోవాలి. ఇలా హీరోలు, మేకర్స్ చేతుల్లోంచి సినిమాల రిలీజ్ లు ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. షూటింగ్ కంప్లీట్ అయినా ఎప్పుడు థియేటర్లలోకి రావాలో ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి.
ఇక ఇండస్ట్రీ వార్తల ప్రకారం... మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా విశ్వంభర ఇంకా ఓటీటీ డీల్స్ కాలేదు. ఇప్పుటికే రిలీజైన టీజర్ మిస్ ఫైర్ అవ్వడం, సినిమాపై హైప్ లేకపోవడంతో ఓటీటీ సంస్థలు కొనేందుకు సుముఖత చూపడం లేదని టాక్. అందుకే షూటింగ్, వీఎఫ్ ఎక్స్ లాంటి మెయిన్ పనులన్నీ కంప్లీట్ అయినా.. సినిమా రిలీజ్ ను మేకర్స్ ఇంకా చెప్పలేకపోతున్నారు. 2026 సమ్మర్ కు రావొచ్చని అంటున్నారు. కానీ, అదీనూ క్లారిటీ లేదు.
మరోవైపు, పెద్ది సినిమా కు ఇప్పటికే ఓటీటీ హక్కులు అమ్ముడయ్యాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి వస్తోంది. విడుదలకు ఇంకా 9 నెలల ముందే ఓటీటీ హక్కులు పూర్తి అయ్యాయి. ఈ పాన్ఇండియా సినిమా రూ.105 కోట్లకు డీల్ క్లోజ్ చేసుకుందట. ఈ సినిమాకు టీజర్ తోనే హైప్ క్రియేట్ అయ్యింది. అందుకే భారీ ధర దక్కిందని టాక్. అటు బాలయ్య అఖండ 2 సినిమా టీజర్ రిలీజ్ తర్వాత రూ. 80 కోట్ల ధరకు ఓటీటీ దక్కించుకుంది.
