వీడియో: ఒర్రీ సాహసాలే సాహసాలు
నైట్ పార్టీల్లో చిందులు వేయడంలోనే కాదు, ఇబిజ లాంటి ఎగ్జోటిక్ లొకేషన్‌లో నచ్చినట్టు ఎంజాయ్ చేయడంలోను ఒర్రీ ముందున్నాడు.
By: Sivaji Kontham | 5 Aug 2025 9:18 AM ISTనైట్ పార్టీల్లో చిందులు వేయడంలోనే కాదు, ఇబిజ లాంటి ఎగ్జోటిక్ లొకేషన్‌లో నచ్చినట్టు ఎంజాయ్ చేయడంలోను ఒర్రీ ముందున్నాడు. ఈసారి 30వ బర్త్ డే జరుపుకున్న ఒర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి ఇబిజలో సరస్సుల్లో బోట్ రైడ్ ని ఆస్వాధిస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇంతకుముందు బాలీవుడ్ నుంచి తన స్నేహితులంతా విషెస్ చెబుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దాదాపు వంద మంది గాళ్స్ మధ్యలో చందురుడిలా పుట్టినరోజు కేక్ కట్ చేసాడు ఈ సుందరాంగుడు! అయితే ఇది ఒర్రీని ఇష్టపడే సెలబ్రిటీ కిడ్స్ గురించి కాదు.. అతడిలోని ఫ్యాషన్ సెన్స్, కామిక్ టైమింగ్ గురించి, ప్రతిభ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం.
వృద్ధాప్య భయం దేనికి?
ప్రతిసారీ మీమ్ ఫెస్టులతో సందడిగా కనిపించే సోషల్ మీడియాలు ఇప్పుడు ఓర్రీ వీడియోని షేర్ చేస్తూ, బోలెడన్ని మీమ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే బర్త్ డే బోయ్ ఒర్రీ ఏం చెబుతున్నాడంటే, ఇప్పటికే నేను 30ల నాటికి చాలా మంది జీవితకాలంలో సాధించాల్సినది నేను సాధించాను.. కాబట్టి నిజమైన సవాల్ ఏమిటంటే, ఈ దశాబ్దంలో ఏం చేయాలో గుర్తించడం`` అని రాసాడు. ముసలాడు అవ్వలేదు.. వృద్ధాప్యాన్ని జయించడానికి ధైర్యం చేస్తున్నాను అని అన్నాడు. మొత్తానికి ఓర్రీ ఇప్పటి నుంచే వృద్ధాప్యం గురించి భయపడుతున్నట్టే కనిపిస్తోంది.
40 తర్వాతా ఇలా ఉంటావా?
అంతేకాదు ఇబిజలో తన క్లోజ్ ఫ్రెండ్స్ 20మందిత ఒక సెషన్ కూడా నిర్వహిస్తున్నానని, 20 ఏళ్లు వెనక్కి వెళ్లి ఒకరాత్రి వారిని తిరిగి జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని కూడా చెప్పాడు. ఓర్రీ డ్రీమ్స్ నిజంగా ఆసక్తికరం. అయితే ఇదే హుషారు అతడికి 40 తర్వాత కూడా ఉండాలని పలువురు నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓర్రీ అసలు ఉద్యోగం ఏమిటో కూడా చెప్పాలని మళ్లీ ఇప్పుడు కొందరు అతడిని నిలదీసే ప్రయత్నం కూడా చేసారు.
ఒర్రీ సాహసాలు చూడతరమా:
ఒర్రీ త్వరలో `ఖత్రోన్ కే ఖిలాడి` రియాలిటీ షోలో పాల్గొంటున్నాడు. అడ్వెంచర్ ఆధారిత రియాలిటీ షోలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఫ్యాషన్, కీర్తి ప్రతిష్ఠలు దేనిలో అయినా నా లిమిటేషన్స్ ని పరీక్షించుకోవడం నాకు ఎప్పుడూ ఇష్టం. ఏదో స్టంట్స్ కోసం కాదు..లక్షలాది మంది ముందు నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా ఉండి చూపిస్తాను అని అన్నాడు. మొత్తానికి అడ్వెంచర్ షోలోకి ప్రవేశించే ముందు బోట్ రైడ్ లో అపశ్రుతికి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసాడు. బోట్ వేగంగా వెళుతుంటే, డ్యాన్సాడుతున్న ఓర్రీ అకస్మాత్తుగా బ్లూ వాటర్స్ లోకి జారి పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
