ఓర్రీ ముద్దులతో ఇర్రిటేట్ అయిన సెలబ్స్
ఓవైపు అందాల భామలు.. మరోవైపు యువహీరోలు ఈవెంట్ ముగించి వెళుతుంటే, అందరితో సెల్ఫీ దిగుతూ ఒక ముద్దిచ్చాడు ఒర్రీ.
By: Sivaji Kontham | 4 Jan 2026 1:00 AM ISTఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి పరిచయం అవసరం లేదు. గాళ్స్ ఎక్కడ ఉంటే, అతడు అక్కడ ఉంటాడు. నిత్యం అతడి చుట్టూ అందాల కథానాయికలు ఉండాల్సిందే. ఒర్రీ పార్టీల్లో కనిపించాలంటే చాలా డబ్బు కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అతడు చాలా కాలంగా ఇలాంటి ఆర్జనతో బండి నెట్టుకొస్తున్నాడని కథనాలొచ్చాయి. రిలయన్స్ కంపెనీలో జాబ్ చేస్తూ.. నైట్ పార్టీలతోను సంపాదించడం అతడి ప్రత్యేకత. ఉద్యోగాన్ని మించి ఈవెంట్లతో సంపాదిస్తున్నాడు. ఒక్కో ఈవెంట్ కి లక్షల్లో అతడు రెవెన్యూ వెనకేసుకుంటున్నాడు.
అవ్రతమణిలో అంతటి ప్రత్యేకత ఏం ఉంది? అంటే అతడిని పార్టీ క్రౌడ్స్ అంత ఇదిగా ఇష్టపడతారు గనుకనే. ఓర్రీ ఎక్కడ ఉంటే అక్కడ ఫన్... ఆనందం. అందరినీ ఆటపట్టిస్తాడు. సరదాగా ఆడిస్తాడు. ఇర్రిటేట్ చేస్తాడు. అతడు ఏం చేసినా అది అందరికీ నచ్చుతుంది. ఇటీవల అతడి ఫ్యాషన్ సెన్స్ శ్రుతి మించుతోంది.
ఇప్పుడు ఓ నైట్ పార్టీలో అతడు ఆడా మగా అనే తేడా లేకుండా అందరినీ కిస్ చేసి షాకిచ్చాడు. ఓవైపు అందాల భామలు.. మరోవైపు యువహీరోలు ఈవెంట్ ముగించి వెళుతుంటే, అందరితో సెల్ఫీ దిగుతూ ఒక ముద్దిచ్చాడు ఒర్రీ. అయితే అతడి ఫన్ కి, స్వీట్ కిస్ కి కొందరు ఇర్రిటేట్ అవుతుంటే, చాలా మంది ఆశ్చర్యపోయారు. చనువుగా అతడు ముద్దులిచ్చిన వారిలో తెలుగు నటుడు హర్షవర్ధన్ రాణే, బిజీ నటి మౌనిరాయ్ కూడా ఉన్నారు. అతడు ఓ సెలబ్రిటీని ముద్దుకు బదులుగా నా*తూ కూడా కనిపించాడు.
ఓర్హాన్ అవ్రతమణి ఇటీవల నటుడు అవుతున్నాడంటూ చాలా ప్రచారం సాగింది. కానీ అతడు ఇంకా ఇన్ ఫ్లూయెన్సర్ వృత్తిలోనే ముందుకు సాగుతున్నాడు. అయితే అతడు ఏదో ఒక రోజు నటుడిగా ఆరంగేట్రం చేస్తాడు. కానీ హీరోగా కాదు.. ఒక కమెడియన్ గా..అని కూడా తెలుస్తోంది.
