పెళ్లయిన హీరోయిన్ల సరసన ఎవరీ చందురూడు?
అతడు ఎప్పుడూ పార్టీల్లో తలమునకలుగా ఉంటాడు. యువ కథానాయికలతో కలిసి వైన్ గ్లాస్ ఒలకబోస్తుంటాడు.
By: Sivaji Kontham | 2 Aug 2025 10:02 AM ISTఅతడు ఎప్పుడూ పార్టీల్లో తలమునకలుగా ఉంటాడు. యువ కథానాయికలతో కలిసి వైన్ గ్లాస్ ఒలకబోస్తుంటాడు. అగ్ర కథానాయికలు .. మిడిలేజీ నటీమణులతో లేదా లేజీ గాళ్స్ తో.. ఎప్పుడూ ఎంతో చనువుగా ఉండగలడు. అప్పటికే పెళ్లయిన టాప్ హీరోయిన్స్ తో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ లేదా వారితో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సరసంగా మాట్లాడుతూ, మజాక్ చేస్తూ ఎప్పుడూ చర్చల్లో నిలుస్తాడు. మీడియా హెడ్ లైన్స్ లోకి వచ్చేంత స్టఫ్ అతడిలో ఏం ఉంది? అంటే దానికి సమాధానం ఈ ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు.
బతకడానికి ఏం చేస్తాడు?
ఈ స్పెషలిస్ట్ `గాళ్స్ బోయ్` ఎవరో ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అతడు ది గ్రేట్ ఒర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి. అతడు బతకడానికి ఏ జాబ్ చేస్తావ్? సంపాదన ఉందా? అంటూ వెంకీ మామను ప్రకాష్ రాజ్ నిలదీసినట్టు ప్రశ్నిస్తే.. దానికి సమాధానం లేదు. అతడు రిలయన్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని అంటారు. కానీ అతడు నైట్ పార్టీల్లో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ, భామలతో సరసమాడుతూ సంపాదిస్తానని చెబుతుంటాడు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా అర్థం కాని గందరగోళం సృష్టిస్తాడు. అయితే అతడు నైట్ పార్టీల్లో గొప్ప ఎంటర్ టైన్ మెంట్ ని అందిస్తూ ఆర్జిస్తాడని కొంత స్పష్ఠత వచ్చింది ఈ ఫోటోలు చూసాకే!
నారీ నారీ నడుమ మురారి:
ఇలాంటి గజిబిజి లైఫ్‌లోను ప్రశాంతంగా జీవించే `లేడీ గ్యాంగ్ మేన్` ఓర్హాన్ అవ్రతమణి బర్త్ డే నేడు. ఈ సందర్భంగా బాలీవుడ్ అందగత్తెలతో అతడు దిగిన సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ ని హోరెత్తిస్తున్నాయి. ఓర్హాన్ నారీ నారీ నడుమ ఏ రేంజులో నలిగిపోతున్నాడో చూపించే ఓ ఫోటోగ్రాఫ్ వీటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో సైఫ్ ఖాన్ సతీమణి ది గ్రేట్ కరీనా కపూర్ ఖాన్, రణ్ వీర్ సింగ్ సతీమణి దీపిక పదుకొనేతో అతడి స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. నేటితరం కథానాయికలతోనే కాదు.. సీనియర్ భామలతో అతడు ఎంతో సరసంగా సరదాగా ఫోటో దిగాడు. దీనిని యూత్ వైరల్ గా షేర్ చేస్తున్నారు. అన్నట్టు ఒర్రీ వయసు ఎంత? అంటే.. ఇప్పుడు 30 వ బర్త్ డే చేసుకుంటున్నాడు.
ఓర్రీ సిగ్నేచర్ మార్క్:
బాలీవుడ్ లో నైట్ పార్టీల నుంచి వచ్చే ప్రతి ఫోటోలో ఒర్రీ సిగ్నేచర్ మార్క్ ఫోజ్ ఎప్పుడూ చర్చనీయాంశం. అతడు స్టార్లతో ఎంతో సరదాగా కలిసిపోతూ ఒక ప్రత్యేకమైన ఆహార్యంతో కనిపిస్తుంటాడు. అతడి రూపం, ఎక్స్ ప్రెషన్ ప్రతిదీ సందేహాలకు తావిస్తుంది. అతడిని ఇలా చూశాక, కొందరు `గే` అని కూడా కామెంట్ చేసారు. ఈ కామెంట్లకు అతడు చాలా సీరియస్ గా కౌంటర్లు కూడా వేసాడు. నెటిజనుల దూషణలకు ఒర్రీ సమాధానాలు కూడా గతంలో చర్చగా మారాయి. వివాదాలతో పాటు ప్రమోషన్ కూడా కొట్టేయడం అతడి ప్రత్యేకత.
