Begin typing your search above and press return to search.

ఒర్రీకి న‌ర‌కం చూపించిన హీరోయిన్ మామ్!

తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తల్లి, సీనియర్ నటి అమృత సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారాయి.

By:  Srikanth Kontham   |   28 Aug 2026 12:15 PM IST
ఒర్రీకి న‌ర‌కం చూపించిన హీరోయిన్ మామ్!
X

సోషల్ మీడియాలో తనదైన స్టైల్‌తో, సెలబ్రిటీలతో ఉన్న ఫోటోలతో ట్రెండ్ అయ్యే ఒర్రీ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తల్లి, సీనియర్ నటి అమృత సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారాయి. 2021లో తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని ఒర్రీ వెల్లడించారు. సారా అలీ ఖాన్‌కు ప్రాణ స్నేహితుడిగా ఉండే ఒరి గతంలో ఆమె కుటుంబంతో కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అమృత సింగ్ తనను ఎంతగానో మానసిక వేదనకు గురిచేశారని.. తనకు ఒకరకంగా నరకం చూపించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనాటి సంఘటనలు మానసికంగా ఎంతో కృంగదీశాయని, ఆ కష్టకాలమే తనను జీవితంలో దృఢంగా మార్చిందని పేర్కొన్నారు. అయితే ఆ కాలంలో ఎదురైన తీవ్రమైన మానసిక క్షోభే తనలో కొత్త మార్పునకు కారణమైందని ఒరి తెలిపారు. ఆ అనుభవం తర్వాతే తాను సోషల్ మీడియాలో వచ్చే విమర్శలకు, ట్రోల్స్‌కు పూర్తిగా అతీతంగా మారానని, ఎలాంటి ద్వేషాన్ని అయినా తట్టుకునే శక్తిని ఆ కాలమే తనకు నేర్పించిందన్నారు. ఇతరులు తనపై చూపే వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో ఆ కష్టకాలమే తనకు పాఠంలా నేర్పిందని వెల్ల‌డించారు.

సారా అలీ ఖాన్‌తో తనకు ఇప్పటికీ మంచి స్నేహబంధం ఉన్నా? ఆ కుటుంబంతో తన అనుభవాల గురించి ఒరి ఇంత బహిరంగంగా మాట్లాడటం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సెలబ్రిటీ సర్కిల్స్‌లో ఎంతో క్లోజ్‌గా ఉండే ఒరి లాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత విషయాలను పంచుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఒరి ఇంటర్వ్యూ ద్వారా తన గతం వెనుక ఉన్న చీకటి కోణాలను పంచుకున్నారు. బాహ్య ప్రపంచానికి ఎంతో సరదాగా? లగ్జరీగా కనిపించే సెలబ్రిటీల జీవితాల వెనుక కూడా ఎన్నో మానసిక సంఘర్షణలు ఉంటాయని ఆయన మాటలు నిరూపిస్తున్నాయి. ఒర్రీ చెప్పిన విషయాలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒర్రీకి సోష‌ల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. కేవ‌లం సెల‌బ్రిటీల‌తో రిలేష‌న్ షిప్స్...వారితో ఫోటోలు తీసుకుని ఖాతాల్లో ఫోస్ట్ చేసే ల‌క్ష‌ల్లో సంపాదిస్తున్నాడు. ఓ న‌టుడి కంటే ఎక్కువ ఆదాయం ఒర్రీ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే సంపాదిస్తున్నాడు. ఈ విష‌యంలో ఒర్రీ స్ట్రాటజీ ఎంతో ప్ర‌త్యేక‌మైంద‌నే చెప్పాలి.