Begin typing your search above and press return to search.

'ఆపరేషన్ సఫేద్ సాగర్' మేకర్స్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెచ్చరిక!

ప్ర‌స్తుతం పరిశ్రమలో సైనిక నేపథ్య చిత్రాలు -వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. అయితే దేశ రక్షణ రంగానికి సంబం ధించిన వాస్తవాలను తెరకెక్కించేటప్పుడు చిత్రబృందాలు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.

By:  Srikanth Kontham   |   22 Aug 2026 6:58 PM IST
ఆపరేషన్ సఫేద్ సాగర్ మేకర్స్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెచ్చరిక!
X

ప్ర‌స్తుతం పరిశ్రమలో సైనిక నేపథ్య చిత్రాలు -వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. అయితే దేశ రక్షణ రంగానికి సంబం ధించిన వాస్తవాలను తెరకెక్కించేటప్పుడు చిత్రబృందాలు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమ‌వుతోన్న‌ వెబ్ సిరీస్ `ఆపరేషన్ సఫేద్ సాగర్` విషయంలోనూ ఇదే అంశం చర్చనీయాంశమ‌వుతోంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన చారిత్రాత్మక ఆపరేషన్ ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్ నిర్మాణ సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు మేకర్స్‌కు కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

సాధారణంగా కమర్షియల్ సినిమాలలో హీరోలను ఎలివేట్ చేయడానికి స్లో-మోషన్ వాకింగ్స్, భారీ ఎలివేషన్ సీన్స్ వాడటం సాధారణం. కానీ నిజ జీవితంలో దేశం కోసం ప్రాణాలొదిలే సైనికులను లేదా పైలట్లను కేవలం స్టైలిష్ హీరోలుగా, స్లో-మోషన్‌లో నడిచే వ్యక్తులుగా చూపించవద్దని అధికారులు స్పష్టం చేశారు. సినిమాటిక్ లిబర్టీ పేరుతో అసలు వాస్తవాలను తప్పుగా చూపించొద్ద‌ని కండిషన్ పెట్టారు. దేశాన్ని రక్షించే పైలట్లు - సైనికుల నిజ జీవిత పోరాటాలు, వారి త్యాగాలు ఎంతో పవిత్రమైనవని వాటిని అతిశయోక్తిగా లేదా గ్లామర్ కోణంలో చూపించడం సరికాదని అధికారులు హితవు పలికారు.

రక్షణ రంగం పవిత్రతను, వారి వృత్తిపరమైన నిబద్ధతను తెరపై ఉన్న ఉన్నతికి తగ్గట్టుగా చూపించాలే తప్ప వినోదం కోసం వాటిని మార్చకూడదని మేకర్స్‌ను హెచ్చరించారు. ఈ క్రమశిక్షణ కారణంగానే ఈ సిరీస్ ఎలాంటి అనవసరమైన చెస్ట్-థంపింగ్ లేకుండా సహజంగా తెరకెక్కిందని తెలుస్తోంది. కార్గిల్ యుద్ధం సమయంలో 16000 అడుగుల ఎత్తులో ఉన్న శత్రు స్థావరాలపై విమానాలతో దాడి చేయడం ఎంత కష్టతరమో? ఈ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎయిర్‌ఫోర్స్ అధికారుల పర్యవేక్షణ .. వాస్తవిక దృక్పథం వల్లనే ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రామాణికంగా రూపుదిద్దుకుంది.

కేవలం కల్పిత కథ కాకుండా, రియల్ హీరోల కష్టాలను తెరపైకి తీసుకురావడంలో డైరెక్టర్లు ఎయిర్‌ఫోర్స్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించారు. దేశభక్తి చిత్రాలలో కమర్షియల్ హంగుల కంటే నిజాయితీకి పెద్దపీట వేయాలనే నిబంధనలు టెక్నీషియన్లకు ఎంతో పాఠం నేర్పుతాయి. ఎయిర్‌ఫోర్స్ అధికారులు విధించిన హద్దుల వల్లే సిరీస్ స్థాయి మరింత పెరిగిందని విశ్లే షకులు భావిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి రియలిస్టిక్ కంటెంట్‌ను ఎక్కువగా ఆదరిస్తుండటం విశేషం.