Begin typing your search above and press return to search.

ఊసరవెల్లి ఫ్లాప్ కాదు.. నా బెస్ట్ స్క్రిప్ట్!

అయితే, తాజాగా ఈ సినిమా గురించి సురేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   27 March 2026 7:00 AM IST
ఊసరవెల్లి ఫ్లాప్ కాదు.. నా బెస్ట్ స్క్రిప్ట్!
X

సినీ ఇండ‌స్ట్రీలో కొన్నిసినిమాలు రిలీజ్ టైమ్ లో ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, కాలక్రమేణా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ఊస‌ర‌వెల్లి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టైలిష్ డైరెక్టర్ సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ రిజ‌ల్ట్ ను అందుకుంది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి సురేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

నా దృష్టిలో అదొక గొప్ప సినిమా

ఊసరవెల్లి సినిమా ఫెయిల్యూర్ మూవీ కాద‌ని, అది త‌న బెస్ట్ స్క్రిప్ట్ అని, ఆ సినిమాకు తానెప్పుడూ బాధపడలేద‌ని, ఎందుకంటే త‌న దృష్టిలో అదొక‌ గొప్ప సినిమా అని, ఆ సినిమాకు ఇంకా ఎక్కువ ప్రేమ‌, గుర్తింపు ద‌క్కాల్సిందని, త‌న‌కు బెస్ట్ గా న‌చ్చిన సినిమా ఊస‌ర‌వెల్లి అంటూ సురేంద‌ర్ రెడ్డి చెప్పిన మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఆశించ‌న ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయిన ఊస‌ర‌వెల్లి

2011లో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా, అప్పటి ట్రెండ్‌కు కాస్త భిన్నంగా ఉండే కథనంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమ, ప్రతీకారం, సైకాలజికల్ ట్విస్ట్స్ మేళవింపుతో రూపొందించిన ఈ కథలో ఎన్టీఆర్ యాక్టింగ్ ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా ఆయన పాత్రలోని గ్రే షేడ్స్, ఎమోషనల్ డెప్త్ అప్పటి ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. అయితే, స్క్రీన్‌ప్లే సెలెక్ష‌న్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్‌ను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

ఊస‌రవెల్లికి స్పెష‌ల్ ఫ్యాన్ బేస్

కానీ ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత సంవత్సరాలు గడిచేకొద్దీ, ఊసరవెల్లి మూవీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమాలోని లవ్ ట్రాక్, దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన మ్యూజిక్ ఆల్బమ్, కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సినీప్రియులలో కూడా ఈ సినిమాకు మంచి రిపీట్ వ్యాల్యూ ఉంది. టెలివిజన్ ప్రసారాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరింది. కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే తర్వాతి రాను రాను తమ విలువను నిరూపించుకుంటాయి. అదే కోవలో ఈ సినిమా కూడా నిలిచిపోయింది. ఇప్పుడు సురేందర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో, ఊసరవెల్లిపై మరోసారి చర్చ మొదలైంది.