Begin typing your search above and press return to search.

'నీకే ట్యాగ్ అయ్యానే మల్లు పిల్లా'.. కిరణ్ 'ఓనమ్' సాంగ్ అదుర్స్!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా థియేటర్స్ లో కొత్త చిత్రాలతో సందడి చేస్తున్నారు.

By:  M Prashanth   |   9 Aug 2025 12:43 PM IST
నీకే ట్యాగ్ అయ్యానే మల్లు పిల్లా.. కిరణ్ ఓనమ్ సాంగ్ అదుర్స్!
X

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా థియేటర్స్ లో కొత్త చిత్రాలతో సందడి చేస్తున్నారు. ఇప్పుడు కె ర్యాంప్ మూవీతో బిజీగా ఉన్నారు. ది రిచెస్ట్ చిల్లర్ గయ్ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌ లైన్ తో ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాస్ ఎలిమెంట్స్ తో సరికొత్తగా తెరకెక్కుతున్న కె ర్యాంప్ మూవీకి జెయిన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రంగబలి ఫేమ్ యుక్తి తరేజా.. కిరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు.

దీపావళి కానుకగా అక్టోబర్ 18న సినిమా రిలీజ్ అవ్వనుండగా, ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఫస్ట్ గ్లింప్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ అవ్వగా.. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ఓనమ్ పాట రిలీజ్ చేస్తున్నట్లు తెలిపి అంచనాలు పెంచారు. ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్ వీడియో విడుదల చేసి.. అంతా వెయిట్ చేసేలా చేసి సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు చెప్పినట్లు శనివారం ఉదయం సాంగ్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మాస్ మెలోడీ బ్యాంగర్ తో కె ర్యాంప్ మ్యూజికల్ ఫెస్ట్ ను స్టార్ట్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇన్ స్టా ఆపేశానే.. ట్విట్టర్ మానేశానే.. నీకే ట్యాగయ్యానే అంటూ సాగుతున్న సాంగ్.. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారి మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

సురేంద్ర క్రిష్ణ లిరిక్స్ అందించిన పాటను చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. సాహితితో కలిపి ఆలపించారు. పోలాకి విజయ్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఊహించినట్లుగానే సాంగ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సెలబ్రేషన్ మోడ్ ఆన్ అని చెబుతున్నారు. సాంగ్ అన్ని విషయాల్లో బాగుందని అంటున్నారు.

అయితే సాంగ్ అంతా కలర్ ఫుల్ గా ఉందని చెప్పాలి. తెలుపు పంచె, రెడ్ కలర్ షర్ట్ లో కిరణ్ అదిరిపోయారు. హీరోయిన్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్స్ అంతా ట్రెడిషనల్ గా కనిపించారు. సాంగ్ మ్యూజిక్ ఫుల్ జోష్ తెప్పిస్తోంది. కిరణ్ అబ్బవరం స్టెప్పులు, ఎక్స్ప్రెషన్స్ సూపర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఓనమ్ సాంగ్ మెప్పిస్తూ.. ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి మీరు సాంగ్ విన్నారా.. కిరణ్ స్టెప్పులు చూశారా?