ఐశ్వర్యా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నట్టుందే!
అదే ఓ.. సుకుమారీ. ఇవాళ ఐశ్వర్యా రాజేష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాలో ఆమె లుక్ ను రివీల్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Jan 2026 3:13 PM ISTది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తో యంగ్ హీరో తిరువీర్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకున్నారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ కూడా ఓ భారీ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అదే ఓ.. సుకుమారీ. ఇవాళ ఐశ్వర్యా రాజేష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాలో ఆమె లుక్ ను రివీల్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఐశ్వర్యా
తిరువీర్, ఐశ్వర్యా జంటగా నటిస్తున్న ఈ సినిమాతో భరత్ దర్శన్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మహేశ్వర రెడ్డి మూలి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే సినిమాలో ఐశ్వర్య పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనున్నట్టు అర్థమవుతుంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. అయితే పోస్టర్ లో ఐశ్వర్యా విలేజ్ లుక్స్ మాత్రమే కాకుండా ఆమె వెనుక ఊరి లోని జనమంతా పరిగెత్తడం కూడా చూపించారు. చూస్తుంటే సినిమాలో ఐశ్వర్య పాత్ర చాలా కొత్తగా ఉండనున్నట్టు తెలుస్తోంది. దామిని అనే సాంప్రదాయ యువతిగా ఐశ్వర్య లుక్ ను మేకర్స్ ప్రెజెంట్ చేయగా, ఈ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
పోస్టర్ ను బట్టి చూస్తుంటే సినిమా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‌తోనే తెరకెక్కుతున్నట్టు అనిపిస్తోంది. పోస్టర్ లో ఐశ్వర్య ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు కుషేందర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగుతో పాటూ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
