ఓజీ: అజిత్ సినిమా కాపీనా? క్లారిటీ ఇచ్చిన సుజిత్
ఏదైనా సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఒక వర్గం.. చిత్రంలో నుంచి నెగిటివ్ లు, ఏవైనా కాపీ సీన్స్ ఉన్నాయా, ఇతర సినిమాను కాపీ కొట్టారా?.. అని వేతికేస్తుంటారు.
By: M Prashanth | 26 Sept 2025 5:48 PM ISTఏదైనా సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఒక వర్గం.. చిత్రంలో నుంచి నెగిటివ్ లు, ఏవైనా కాపీ సీన్స్ ఉన్నాయా, ఇతర సినిమాను కాపీ కొట్టారా?.. అని వేతికేస్తుంటారు. లేదా వేరే సినిమాతో పోల్చుతుంటారు. తాజాగా రిలీజైన ఓజీ కి కూడా ఆ కష్టాలు తప్పట్లేదు. తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా బ్యాక్ డ్రాపే ఓజీ చిత్రంలో ఉందని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
దీనిపై ఓజీ దర్శకుడు సుజిత్ కు తాజా ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. నీ సినిమాను అందరు గుడ్ బ్యాడ్ అగ్లీ అంటున్నారు అని యాంకర్ సుజిత్ ను అడిగారు. దీనికి సుజిత్ తన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కోసం డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ పేపర్ పై పెన్ను పెట్టకముందే తాను ఓజీ టీజర్ రిలీజ్ చేసేశానని అన్నారు. ఆ సినిమా డైరెక్టర్ అధిక్ కు తనకు చాలా గౌరవం ఇస్తాడని.. తాను ప్రభాస్ తో సాహో సినిమా చేసినప్పుడు ప్రశంసిస్తూ చాలా పెద్ద మెసేజ్ పెట్టాడని అన్నాడు.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కోసం అధిక్ పేపర్ పై పెన్ను పెట్టకముందే, నేను నా సినిమా టీజర్ రిలీజ్ చేశా. అధిక్ నాకు పర్సనల్ గా తెలిసిన వ్యక్తి. నేను సాహో సినిమా చేసినప్పుడు నీ వర్క్ కు పెద్ద ఫ్యాన్ అన్నా అని పెద్ద మెసేజ్ పెట్టాడు. తను తన ఫస్ట్ సినిమా చేసినప్పుడే నాకు పరిచయం. అప్పట్నుంచి నన్ను అధిక్ ఫాలో అవుతున్నాడు. తన సినిమా ప్రారంభం కాకముందే.. నేను కథ రాసేశాను. కటానా తో ఎప్పుడో యాక్షన్ సీన్స్ షూట్ చేశాను.
కానీ ఆ తర్వాత అందరూ కటానాతో సినిమాలు వచ్చాయి. అయితే వాళ్లు కావాలని చేయకపోయినా... ఎవరి కంటెంట్ ముందు బయటకు వస్తే అదే ఒరిజినల్ అని జనాలు అనుకుంటారు. ఇలాంటి వాటిలో నాలాంటి వాళ్లకు డ్యామేజ్ అవుతుంది. కొంతమంది సక్సెస్ ను కొందరు ఒప్పుకోరు. గుడ్ బ్యాడ్ అగ్లీ కంపారిజన్ నడుస్తుందని .. నాకు కూడా కొందరు చెప్పారు. అయితే అధిక్ సాధించనదానికి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా.
అతడు మార్క్ ఆంటోనీ చేసినప్పుడు తను టాలెంటెడ్ అని అనిపించింది. మేమంతా స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేయాలనే ఆలోచిస్తాం. అజిత్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో మనోడు సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులో కూడా అర్జున్ దాస్ విలన్ గా ఉన్నాడు. అయితే నేను నా సినిమాలో అర్జున్ ను ఎంపిక చేసి షూటింగ్ చేసిన తర్వాత ఆ సినిమాకు విలన్ గా వెళ్లాడు. అని సుజిత్ క్లారిటీ ఇచ్చారు.
కాగా, గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ ఏడాది ఏప్రిల్ 10న రిలీజైంది. ఇందులో అజిత్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగుతోంది . అందుకే ఓజీతో కంపారిజన్ షురూ అయ్యింది.
