Begin typing your search above and press return to search.

OG: మళ్ళీ సౌండ్ తగ్గిందే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాపై టాలీవుడ్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.

By:  M Prashanth   |   9 Sept 2025 6:00 PM IST
OG: మళ్ళీ సౌండ్ తగ్గిందే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాపై టాలీవుడ్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు, ట్రేడ్ సర్కిల్స్ పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్, పాటలు అంచనాలను పెంచేశాయి. రిలీజ్ ముందు నుంచే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోవడం కూడా సినిమాపై ఉన్న క్రేజ్‌కి నిదర్శనం.

అమెరికాలోని ప్రీమియర్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో సాగాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) కంటే ముందే సినిమా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసింది. ఇది పవన్ అభిమానులకు సూపర్ బర్త్‌డే గిఫ్ట్‌గా మారింది. రిలీజ్‌కు మూడు వారాల ముందే ఈ లెవెల్ కలెక్షన్స్ రావడం టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమాల్లో అరుదైన విషయమని అనిపించింది.

అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మొదటి వారం మిలియన్ దాటిన తర్వాత ఓజీ కలెక్షన్స్ స్లో అయ్యాయి. గత నాలుగు నుంచి ఐదు రోజులుగా మరో 100K డాలర్ల వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. అంటే ఓపెనింగ్ వీక్‌లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా, తర్వాతి రోజుల్లో వేగం తగ్గిందన్నమాట. ఈ పరిస్థితి చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఇకపోతే మూవీ మొదటే 2.5 మిలియన్ వరకు చేరుతుందని అంచనాలు వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే రిలీజ్ వరకు మళ్లీ హైప్ తీసుకొచ్చేలా ప్రమోషన్లను జోరుగా నడిపించకపోతే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని అనిపిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ దగ్గర పడే కొద్దీ మళ్లీ బజ్ వస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. మొత్తం మీద అమెరికాలో ఓజీ ఇప్పుడు ఫ్యాన్స్‌లో మిక్స్‌డ్ రియాక్షన్స్‌ను రేపుతోంది.

మొదట రికార్డులు బద్దలు కొట్టి హైప్ పెంచింది. ఇప్పుడు స్లో అయినా, రిలీజ్ సమయానికి మళ్లీ జోరందుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్, సుజీత్ స్టైలిష్ మేకింగ్, థమన్ మ్యూజిక్ వలన రిలీజ్ సమయానికి ఓజీ బాక్సాఫీస్ వద్ద తుఫాన్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఓవర్సీస్ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లలో వేరే రేంజ్‌లో హైప్ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బిజినెస్ రికార్డులు సెట్ చేసిన ఓజీ థియేట్రికల్ రిలీజ్ సమయానికి గ్లోబల్‌గా ఎలా మారుతుందో చూడాలి.