Begin typing your search above and press return to search.

పవన్ OG.. జాన్ విక్ చిత్రాలకు మించి ఉంటుందా?

ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, సిరి లెళ్ల కీలక పాత్రలు పోషించిన ఓజీ మూవీ తమన్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు

By:  M Prashanth   |   22 Sept 2025 11:00 PM IST
పవన్ OG.. జాన్ విక్ చిత్రాలకు మించి ఉంటుందా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజిత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా యాక్ట్ చేశారు.

ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, సిరి లెళ్ల కీలక పాత్రలు పోషించిన ఓజీ మూవీ తమన్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమా.. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్.. తాజాగా సినిమా ట్రైలర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు.

ఇప్పటికే ఓజీ కన్సర్ట్ లో ట్రైలర్ ను ప్లే చేసిన మేకర్స్.. ఇప్పుడు అధికారికంగా తీసుకొచ్చారు. అందులో పవన్‌ కల్యాణ్‌ స్టైలిష్‌ లుక్స్‌ హైలెట్ గా నిలిచాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌ పాత్రలో అదరగొట్టేశారు. ఓవరాల్ గా ట్రైలర్.. సినిమాపై ఉన్న హైప్ ను ఆకాశాన్ని తాకేలా చేసింది.

అయితే ఇప్పుడు ట్రైలర్ కోసం జోరుగా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. సింప్లీ సూపర్బ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో హాలీవుడ్ జాన్ విక్ సిరీస్ కోసం ప్రస్తావిస్తున్నారు. ఇంగ్లీష్ మూవీస్ ను రెగ్యులర్‌ గా ఫాలో అయ్యే ప్రేక్షకులకు పరిచయమైన ఆ సిరీస్ సినిమాలతో కొందరు నెటిజన్లు కంపేర్ చేస్తున్నారు.

జాన్ విక్ సిరీస్ లో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు రాగా.. అందులో ముఖ్య అంశం యాక్షన్. ఇప్పుడు ఓజీ మూవీ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గానే రానుంది. అయితే జాన్ విక్ సిరీస్ చిత్రాల్లో కీనూ రీవ్స్.. తొలుత అండర్ వరల్డ్ లో ఉంటాడు. అ తర్వాత బయటకు వస్తాడు. కానీ అతనికి ఇబ్బంది పెట్టడంతో మళ్లీ రంగంలోకి దిగి చంపుతాడు.

ఇప్పుడు ఓజీ మూవీలో అలాంటి ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయని.. ట్రైలర్ ద్వారా తెలుస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో జాన్ విక్ చిత్రాలకు మించి ఓజీ ఉండనుందని ట్రైలర్ చూశాక ఫుల్ క్లారిటీ వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. మన స్టైల్ కు తగ్గట్టు సుజీత్ తీసి ఉంటారని అంచనా వేస్తున్నారు. జాన్ విక్ తో ఓజీకి ఎలాంటి సంబంధం లేకపోయినా జస్ట్ కొందరు కంపేర్ చేస్తున్నారు. వాళ్లు అనుకున్నట్లే జాన్ విక్ కు మించి ఓజీ ఉంటుందేమో చూడాలి.