పవన్ OG.. అఖండ-2 యూజ్ చేసుకుంటుందా?
రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఓజీ.. ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
By: M Prashanth | 7 Oct 2025 11:03 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ (They Call Him OG) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాలో ఓజాస్ గంభీరగా కనిపించిన పవన్ కళ్యాణ్.. తన యాక్టింగ్ అండ్ స్వాగ్ తో మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కూడా రాబట్టారు.
రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఓజీ.. ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తద్వారా 2025లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. విక్టరీ వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం మూవీ రికార్డును బ్రేక్ చేసింది.
ఇప్పటి వరకు ఈ ఏడాది టాప్ గ్రాసర్ మూవీగా నిలిచిన వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఆ చిత్రం రూ.300 కోట్ల మార్క్ ను కంప్లీట్ థియేట్రికల్ రన్ లో అందుకుంది. ఇప్పుడు ఓజీ ఆ రికార్డును కేవలం 11 రోజుల్లోనే సాధించి సత్తా చాటింది. ఆ విషయాన్ని మేకర్స్ కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అలా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డును ఓజీ బ్రేక్ చేయగా.. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసే ఛాన్స్.. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ-2కు ఉందనే చెప్పాలి. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అఖండకు సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.
డిసెంబర్ లో రిలీజ్ కానున్న ఆ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. అలా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాపై హైప్ క్రియేట్ ఉంది. దీంతో ఇప్పుడు అఖండ-2.. 2025లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అయితే అఖండ-1 అప్పట్లో సెన్సేషనల్ లాంగ్ రన్ తో సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు అఖండ-2 కూడా అంతకుమించి వసూళ్లు సాధించడం మాత్రం పక్కా. అదే సమయంలో డిసెంబర్ నెల మొత్తం భారీ కలెక్షన్స్ సాధించి హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడం పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి ఇప్పుడు ఓజీ మూవీ రికార్డును అఖండ-2 బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
