OGకి రూ.1000.. ఇక SSMB29కి ఎంత ఉంటుందో?
ఇప్పుడు ఓజీకి రూ.1000 టికెట్ రేట్ అంటే ఫ్యూచర్ లో తెలుగులో మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ ఎమ్బీ 29 తెరకెక్కుతుంది.
By: M Prashanth | 18 Sept 2025 7:24 PM ISTఓజీ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కు అధిక టికెట్ ధరల రేట్లు షాక్ ఇవ్వనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఓజీ సినిమా ప్రీమియర్ టిక్కెట్లను రూ. 1000 ధరకు అనుమతించాలని మేకర్స్ సంబంధింత అధికారులకు రికెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. హీరో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కావడం విశేషం. పైగా ఈ అనుమతులు ఇచ్చే అధికారాలు ఆయన దగ్గరే ఉన్నాయి. అలాంటింది ఈ విషయంలో ఆయన నుంచి అనుమతి కోరుకోవటం ఒక రకంగా విచిత్రంగా అనిపిస్తోంది. ఇటు తెలంగాణలో కూడా సీఎం రూ. 1000 టిక్కెట్ విషయంలో అనుమతి ఇవ్వవచ్చు.
అయితే, తెలంగాణలో సినిమాలకు ఎలాంటి మిడ్ నైట్ ప్రీమియర్స్ కు అనుమతులు ఇచ్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలోనే స్పష్టం చేశారు. దీంతో ఇక్కడ మిడ్ నైట్ షోలు ఉండడం డౌటే! కానీ, షూటింగ్ ఆలస్యం కారణంగా బడ్జెట్ పెరిగింది. అంతమాత్రానికి సినిమా టికెట్ ధరలు ఇంతలా పెంచి అమ్మితే టాలీవుడ్ లో భవిష్యత్ లో రానున్న సినిమాలకు ఏ రేంజ్ లో ఉంటాయోనని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇప్పుడు ఓజీకి రూ.1000 టికెట్ రేట్ అంటే ఫ్యూచర్ లో తెలుగులో మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ ఎమ్బీ 29 తెరకెక్కుతుంది. మరోవైపు అట్లీతో అల్లు అర్జున్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఓజీకే టికెట్ ధర రూ.1000 నిర్ణయిస్తే.. ఆ సినిమాలకు ఇంకెంత రేంజ్ లో ఉంటాయోనని సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికైతే టికెట్ల రేట్ల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే స్థాయిలో టికెట్ ధరలు ఉంటే మాత్రం సినీ ప్రియుల నుంతి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఓజీ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆసక్తిగా ఉంది.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో వారంలో థియేటర్లలోకి రానుంది. సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి, ప్రకాశ్ రాజ్, శ్రేయ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించారు.
