21కి 21 గెలిచినప్పుడు ఉన్న హై ఇవాళ ఓజీకి ఉంది: తమన్
మేం కూడా జాగ్రత్తగా చేశాం. సుజిత్ తో రెండేళ్లు ట్రావెల్ చేస్తున్నా. కథ చెప్పినప్పుడే అనుకున్న ఈ సినిమా చరిత్ర సృష్టింస్తుందని. ఆయనను నేనూ అలాగే చూడాలనుకున్నా.
By: M Prashanth | 25 Sept 2025 5:22 PM ISTపవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాకు ఉన్న హైప్ తో భారీ స్థాయిలోనే ప్రీమియర్స్, ఓపెనింగ్ బుకింగ్స్ జరిగాయి. ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కు మేకర్స్ హ్యాపీగానే ఉన్నారు. ఈ క్రమంలో మూవీ మేకర్స్ బాక్సాఫీస్ డిస్ట్రక్టర్ పేరుతో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత దానయ్యతోపాటు నాగవంశీ, డైరెక్టర్ సుజిత్, తమన్, ప్రియాంక పాల్గొన్నారు.
ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. అప్పుడప్పుడు కొంచెం బ్లాంక్ అయిపోతాం. సినిమాకు ముందు కాన్పిడెంట్ గా ఉంటాం. కానీ సక్సెస్ వచ్చాక లైఫ్ లో భయం వచ్చేస్తుంది. సక్సెస్ అనేది సెన్సిటివ్ థింగ్. పేరు తెస్తుంది. కానీ దాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ సినిమాను అందరూ ఓన్ చేసుకున్నారు. ఓజీ బ్యాండ్, మర్చండైజ్ వేసుకోవం ఇలా అందరూ ఓజీని ఓన్ చేసుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి పవర్.
మేం కూడా జాగ్రత్తగా చేశాం. సుజిత్ తో రెండేళ్లు ట్రావెల్ చేస్తున్నా. కథ చెప్పినప్పుడే అనుకున్న ఈ సినిమా చరిత్ర సృష్టింస్తుందని. ఆయనను నేనూ అలాగే చూడాలనుకున్నా. ఖుషిలో చిన్న ఫైట్ చాలా నచ్చుతుంది. అలాంటిది అదే వైబ్ లో సినిమా ఉడడం గ్రేట్. త్రివిక్రమ్ సర్ కు థాంక్స్. ఈ ప్రాజెక్ట్ ను పాజిబుల్ చేశారు. ఈ సినిమాకు అన్నీ ఆయనే. ఇక పవన్ గారితో పని చేయడం నా డ్రీమ్. దానికి నాకు 100 సినిమాలు పట్టింది. త్రివిక్రమ్ గారితోనూ అంతే.
వకీస్ సాబ్, బీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా నాలుగు సినిమాలకు పని చేశా. దీనికి కూడా త్రివిక్రమ్ సార్ కారణం. ఓ హీరో నాలుగు సినిమాలకు సపోర్ట్ చేయడం పెద్ద విషయం. మేమంతా ఆయన అభిమానులమే. ఆయనను ఓ హీరోగా, లీడర్ గా, డిప్యూటీ సీఎం గా గౌరవిస్తాం. ఆయన 21 కి 21 స్థానాల్లో నెగ్గి ఎలాంటి హై ఇచ్చారో, ఈరోజు అదే హైప్ ఫీల్ అవుతున్నాం. ఓజీ అనేది రెండు నెలల ముందు కాపీ చూశాం. ప్రమోషన్స్ పై డిపెండ్ అవ్వలేదు. మీడియాను కలవలేదు. జనాలే సినిమాను ఓన్ చేసుకున్నారు.
సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి. నిర్మాతలు మాకేంతో సపోర్ట్ ఇచ్చారు. వాళ్లు మాకు చాలా మద్దతు ఇచ్చారు. ఈ సినిమాకు అంతా కష్టపడి పనిచేశాం. ఎవ్రిథింగ్ బాగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడాలని 12ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఈ సక్సెస్ ఆడియెన్స్ సక్సెస్. ప్రియాంక కూడా మార్నింగ్ నుంచి అన్ని థియేటర్లు తిరుగుతూ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. పీకే ఫ్యాన్స్ కు థాంక్స్. అంటూ తమన్ చెప్పుకొచ్చారు.
