హమ్మయ్య.. ఓ పనైపోయింది ఓజీ
కుర్రాడు కాబట్టి మొన్న కన్సర్ట్ సందర్భంగా సుజీత్‌లో అలసల లాంటిదేమీ కనిపించలేదు కానీ.. అతను ఎదుర్కొన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. కొన్ని వారాల నుంచి అతను రేయింబవళ్లు ‘ఓజీ’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉన్నాడు.
By: Garuda Media | 24 Sept 2025 8:51 PM ISTఒక భారీ సినిమా రిలీజవుతుంటే.. దాని దర్శకుడు, మిగతా టీం పడే కష్టం అంతా ఇంతా కాదు. అందులోనూ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యం జరిగితే, రిలీజ్ డేట్ డెడ్ లైన్ తరుముకొస్తుంటే.. టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. గత ఏడాది ‘పుష్ప-2’ రిలీజ్ ముంగిట దర్శకుడు సుకుమార్ ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నారో ఆయన ముఖంలో స్పష్టంగా తెలిసిపోయింది. పూర్తిగా డ్రైన్ అయిపోయినట్లు కనిపించిన సుకుమార్.. మామూలు మనిషి కావడానికి కొన్ని రోజుల సమయం పట్టింది.
కుర్రాడు కాబట్టి మొన్న కన్సర్ట్ సందర్భంగా సుజీత్‌లో అలసల లాంటిదేమీ కనిపించలేదు కానీ.. అతను ఎదుర్కొన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. కొన్ని వారాల నుంచి అతను రేయింబవళ్లు ‘ఓజీ’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లోనే నిమగ్నమై ఉన్నాడు. బెస్ట్ క్వాలిటీతో సినిమాను అందించాలని తపిస్తున్నాడు. ప్రమోషన్లు చేయట్లేదని, ట్రైలర్ సమయానికి రాలేదని, ఓవర్సీస్ కంటెంట్ ఆలస్యమైందని అభిమానులు ఎంత సుజీత్‌ను తిట్టుకున్నా.. అతను మాత్రం ఫైనల్ ఔట్ పుట్ ది బెస్ట్‌గా ఇవ్వాలనే తపనతోనే పని చేశాడు.
మొత్తానికి మంగళవారం సాయంత్రం ‘ఓజీ’ పని పూర్తయింది. రాత్రికల్లా ఓవర్సీస్ కంటెంట్ డెలివరీ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. ఫైనల్ కాపీ డెలివరీ చేశాక సుజీత్ రిలాక్స్ అయ్యాడు. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటూ.. ఓజీ ఫైనల్ కాపీని బయటికి తీసుకొచ్చేందుకు రేయింబవళ్లు శ్రమించిన సుజీత్.. ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నాడు.
ఈ క్రమంలోనే తనతో పాటు కొన్ని రోజులుగా శ్రమిస్తున్న సంగీత దర్శకుడు తమన్, ఎడిటర్ నవీన్ నూలిలను ప్రశంసిస్తూ ‘ఎక్స్’లో పోస్టులు పెట్టాడు. ఇక మూడేళ్లు పైగా సుజీత్ అండ్ టీం కష్టానికి ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల నుంచే థియేటర్లలో ‘ఓజీ’ సందడి మొదలు కాబోతోంది. ప్రిమియర్స్‌కు పాజిటివ్ టాక్ వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత చూడబోతున్నట్లే. చూద్దాం మరి సుజీత్ ఏం డెలివర్ చేశాడో?
