సీడెడ్‌లో పవన్ హవా.. మొదటి రోజు వసూళ్లతో సెన్సేషన్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సీడెడ్‌లో ఓజీ ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజే 10.34 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తెలుస్తోంది.
By: M Prashanth | 26 Sept 2025 11:44 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రిలీజ్‌కి ముందు నుంచే ఉన్న బజ్ కారణంగా ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది. ముఖ్యంగా యూఎస్ ప్రీమియర్స్‌లో పవన్ సినిమాకు అభిమానులు భారీగా టర్న్ అవ్వడంతో రికార్డుల మోత మోగింది. ఈ తరహా మాస్ క్రేజ్ చాలా అరుదుగా కనిపిస్తుంది.
సినిమా విడుదలైన మొదటి రోజు టాక్ మిక్స్‌డ్‌గా ఉన్నా, పవన్ అభిమానుల హంగామా వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఎంట్రీ సీన్స్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎంజాయ్ చేస్తూ థియేటర్లలో సందడి చేశారు. ఈ హైప్ సీడెడ్‌లో కూడా బాగా పనిచేసింది. ఆ ప్రాంతంలో పవన్ సినిమా ఎప్పుడూ కూడా మంచి వసూళ్లు సాధిస్తుందనే ట్రాక్ రికార్డు ఉంది. ఈసారి కూడా అదే మిరాకిల్ జరిగింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సీడెడ్‌లో ఓజీ ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజే 10.34 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తెలుస్తోంది. హయ్యర్లతో కలిపి ఇది చాలా పెద్ద ఫిగర్. పవన్ మార్కెట్ అక్కడ ఎంత బలంగా ఉందో ఈ నెంబర్ మరోసారి రుజువు చేసింది. నిజానికి సీడెడ్‌లో మాస్ సినిమాలకు ఎప్పటినుంచో స్ట్రాంగ్ బేస్ ఉంది. ఓజీ మాత్రం దాన్ని మరింత పెంచేలా చేసింది.
దసరా హాలిడేస్ సీజన్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతోంది. గురువారం రిలీజ్ కావడంతో వీకెండ్ లాంగ్ హాలిడే మూడ్‌లో ప్రేక్షకులు థియేటర్లకు భారీగా రావొచ్చు. ఇది బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, టాక్ మిక్స్‌డ్ అయినా పవన్ ఫ్యాన్స్ పవర్ వల్ల కలెక్షన్లలో పెద్ద డిప్ ఉండకపోవచ్చు.
ఇక ఓవర్సీస్ బజ్ విషయానికి వస్తే, ఇప్పటికే ఓజీ టాప్ ప్రీమియర్ గ్రాసర్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. పవన్ సినిమాకు అక్కడ కూడా మాస్ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. దేశీయ మార్కెట్‌లోనూ మొదటి రోజు రికార్డులు వర్షం కురిపిస్తూ, పవన్ స్టామినా మళ్లీ బయటపడింది. మొత్తం మీద, ఓజీ మొదటి రోజు సీడెడ్‌లో సాధించిన 10.34 కోట్ల గ్రాస్ ఓ సెన్సేషన్ లాంటిది. టాక్ ఎలా ఉన్నా పవన్ సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ వేరే స్థాయిలో ఉంటాయనే నిజం మరోసారి రుజువైంది. ఇక హాలిడే సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.
