దానయ్య నిజంగానే తప్పుకున్నాడా?
పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ మూవీస్‌లలో సంచలనం సృష్టించింది.
By: Tupaki Entertainment Desk | 21 Dec 2025 12:49 PM ISTపవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. హిట్‌కి.. ఫ్లాప్‌కి సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్‌తో పాటు క్రేజీ మార్కెట్‌ని సొంతం చేసుకున్న హీరో. ఏపీ క్రియాశీల రాజకీయాల్లో బిజీగా మారడం వల్ల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ ఇప్పుడు మళ్లీ స్పీడు పెంచడం తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన మార్కు బ్లాక్ బస్టర్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అదే టైమ్‌లో విడుదలైన మూవీ `ఓజీ`. సుజీత్ దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్నీ పుష్కలంగా ఉన్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది.
ఫస్ట్ డే ఫస్ట్ షోతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని ఫ్యాన్స్‌ని ఖుషి చేసింది. వింటేజ్ పవన్‌ని గుర్తు చేస్తూ మరింత పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా చూపిస్తూ చేసిన `ఓజీ` అభిమానుల్లో సరికొత్త జోష్‌ని నింపింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి 2025లో విడుదలై తెలుగు సినిమాల్లో వన్ ఆఫ్ ద టాప్ మూవీగా నిలిచి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది.
పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ మూవీస్‌లలో సంచలనం సృష్టించింది. సినిమా ఎండింగ్‌లో సీక్వెల్ ఉంటుందని చెప్పడంతో పార్ట్ 2పై సహజంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎప్పుడెప్పుడు సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్‌ని ప్రారంభిస్తారా? అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే `ఓజీ` సీక్వెల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొట్టడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
`ఓజీ`ని నిర్మించిన డీవీవీ దానయ్య సీక్వెల్ నుంచి తప్పుకున్నారని, ఆయనకున్న ఇతర కమిట్‌మెంట్‌ల కారణంగా ఈ ప్రాజెక్ట్‌ని ఆయన చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. అది ఎంత వరకు నిజం అన్నది పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్‌ని భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, పవన్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని యువీ క్రియేషన్స్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయని ఇన్ సైడ్ టాక్.
భారీ చిత్రాలని నిర్మించిన ఈ సంస్థ హీరో ప్రభాస్, అతని సోదరుడిది. అలాంటి వారి చేతికి పవన్ సినిమా వెళితే ఏరేంజ్‌లో ఉంటుందో పెద్దగా చెప్పనక్కరలేదు. `ఓజీ 2`ని ఓ రేంజ్‌లో తెరపైకి తీసుకొస్తారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారట. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఆనౌన్స్‌మెంట్ త్వరలోనే కాబోతోంది. ఈ ప్రకటనతో `ఓజీ` సీక్వెల్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
