సాహోలో గంబీర హింట్.. వైరల్ అవుతున్న వీడియో..!
ఇక ఓజీ 2 లో సాహో, ఓజీ ఇద్దరు కనిపిస్తే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే మాత్రం ఇక ఆ సినిమా రికార్డులు షేక్ చేస్తుందని చెప్పొచ్చు.
By: Ramesh Boddu | 30 Sept 2025 1:25 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజైన దగ్గర నుంచి ఆ సినిమా గురించి స్పెషల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓజీలో సమురాయ్ ఇంకా చిన్నప్పటి సాహోని చూపించడం చూసి సాహో, ఓజీ యూనివర్స్ గా ఇది భావిస్తున్నారు. ఐతే దీనికి డైరెక్టర్ సుజిత్ కూడా క్లారిటీ ఇచ్చాడు. తను చేస్తున్న సినిమాలో ఎక్కడో ఒకచోట అలా చేస్తే బాగుంటుందని అలా చేశాం తప్ప యూనివర్స్ ని ముందే అనుకోలేదని అన్నాడు.
సోషల్ మీడియాలో ఒక వీడియో..
సాహో రిఫరెన్స్ ఓజీలో లేదు కానీ జస్ట్ అలా ఒక షాట్ లో టైగర్ ష్రాఫ్ కనిపించే సరికి బజ్ ఏర్పడింది. నెక్స్ట్ ఓజీ 2 కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ సినిమాలో ఇంకాస్త డీటైల్స్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఐతే ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. సాహోలో ప్రభాస్ ఒక ఫెన్సింగ్ కి నిప్పు అంటించే సీన్ ఉంటుంది. ఆ టైంలో గంబీర ఫోటో కనిపిస్తుంది. అది పవన్ కళ్యాణ్ ఫోటోనే అలా ఒక ఫ్రేం లో వచ్చి వెళ్తుంది.
నిజంగానే అది సినిమాలో ఉందా లేదా ఎవరైనా ఎడిట్ చేశారా అన్నది తెలియదు కానీ ప్రభాస్ సాహో చేస్తున్న టైం లోనే పవర్ స్టార్ గంబీరా రిఫరెన్స్ ని అందులో సుజిత్ ఉంచాడా ఏంటని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఒకవేళ అది నిజమే అయితే మాత్రం సుజిత్ ఓజీ సినిమా 2019 అంటే సాహో టైం లోనే ప్లాన్ చేసి ఉండాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై సుజిత్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
డైరెక్టర్ సుజిత్ కి మార్కులు..
ఇక ఓజీ 2 లో సాహో, ఓజీ ఇద్దరు కనిపిస్తే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే మాత్రం ఇక ఆ సినిమా రికార్డులు షేక్ చేస్తుందని చెప్పొచ్చు. ఓజీ సినిమా విషయంలో డైరెక్టర్ సుజిత్ కి మంచి మార్కులు పడ్డాయి. ఐతే కథ పెద్దగా లేదన్న కంప్లైంట్ ఉన్నా కూడా సినిమా కలెక్షన్స్ బాగున్నాయి కాబట్టి సుజిత్ ఖాతాలో సక్సెస్ పడినట్టే లెక్క.
సుజిత్ నెక్స్ట్ సినిమా నానితో బ్లడీ రోమియో చేస్తున్నాడు. ఆ సినిమాకు ఓజీ తో లింక్ చేస్తాడా అన్న డౌట్ కూడా ఆడియన్స్ లో ఉంది. సో ఈ సినిమాటిక్ యూనివర్స్ ప్లానింగ్ తో సుజిత్ ఆడియన్స్ కి మంచి మాస్ ఫీస్ట్ ఇస్తున్నాడు. నానితో సినిమా తర్వాత సుజిత్ ఎవరితో మూవీ కమిట్ అవుతాడన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
