Begin typing your search above and press return to search.

OG సెట్ నుండీ పవన్, ప్రియాంక అన్ సీన్డ్ ఫోటోలు వైరల్.. ఎంత చక్కగా ఉన్నారో?

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఒకవైపు అభిమానులను అలరించడానికి వరుస చిత్రాలు చేస్తూనే.. మరొకవైపు తన కలను నెరవేర్చుకోవడానికి రాజకీయాలలోకి వచ్చారు.

By:  Madhu Reddy   |   1 Oct 2025 11:53 AM IST
OG సెట్ నుండీ పవన్, ప్రియాంక అన్ సీన్డ్ ఫోటోలు వైరల్.. ఎంత చక్కగా ఉన్నారో?
X

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఒకవైపు అభిమానులను అలరించడానికి వరుస చిత్రాలు చేస్తూనే.. మరొకవైపు తన కలను నెరవేర్చుకోవడానికి రాజకీయాలలోకి వచ్చారు.

దాదాపు 10 సంవత్సరాల నిర్విరామ శ్రమ తర్వాత ఆయన కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకవైపు అధికారంలో చలామణి అవుతూనే.. ప్రజలకు కావలసిన అన్ని అవసరాలను తీర్చుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఒక అధికారిగా తన బాధ్యతను నిర్వర్తించడంపై పవన్ కళ్యాణ్ పై ప్రజలలో కూడా సానుకూల ప్రభావం కనబడుతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులను అలరించడానికి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఓజీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. మొదటి రోజే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మూవీగా కూడా రికార్డు సృష్టించింది.

ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. శ్రేయ రెడ్డి, ప్రకాష్ రాజ్ , అర్జున్ దాస్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్లో పవన్ కళ్యాణ్ తో దిగిన పలు వర్కింగ్ స్టిల్స్ ని ప్రియాంక తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా సినిమా లొకేషన్స్ లో తీసుకున్న ఆ ఫోటోలను ఆమె షేర్ చేయడంతో ఇవి చూసిన అభిమానులు చూడ చక్కని జంట ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఓజీ - కన్మణి జంట అభిమానులకు కన్నుల పండుగగా మారింది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలు చూస్తుంటే.. 90 ల నాటి కాలాన్ని తిరిగి తెరపైకి తీసుకొచ్చినట్లు అనిపిస్తోంది. ఈ చిత్రంలోని ఓజీ - కన్మణి జంట ప్రేమ క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి పైగా ఇందులో కన్మణి - గంభీర కెమిస్ట్రీని అందరూ ఇష్టపడుతున్నారు కూడా..

ప్రియాంక షేర్ చేసిన మరో ఫోటో విషయానికి వస్తే.. ఈమె ఇందులో అందమైన పట్టు చీర కట్టుకొని చాలా సహజంగా మెరిసింది. అటు గంభీర క్యాజువల్ ఫ్యాంట్ , సింపుల్ షర్టులో పర్ఫెక్ట్ గా జతకట్టారు. వీరి కెమిస్ట్రీ స్టైలింగ్ కలిసి ఈ ఫోటోలను గుర్తిండి పోయేలా చేశాయి.. అంతేకాదు ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఓజీ 2 ఈ ప్రేమ క్షణాలను మరిన్ని అందిస్తుంది అని ఆశిస్తున్నారు.