Begin typing your search above and press return to search.

'ఓజీ' సీక్వెల్ కాదు..ప్రీక్వెల్ లో అకీరా!

ఇలాంటి కంటెంట్ తోనే త‌న‌యుడు లాంచ్ అయితే బాగుంటుంద‌ని ప‌వ‌న్ కూడా ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రీక్వెల్ తో అది జ‌రిగితే ప‌వ‌న్ అభిమానుల ఆనందానికి అవ‌ధులుండ‌వ్.

By:  Srikanth Kontham   |   7 Oct 2025 8:00 PM IST
ఓజీ సీక్వెల్ కాదు..ప్రీక్వెల్ లో అకీరా!
X

ఇటీవ‌ల రిలీజ్ అయిన `ఓజీ` మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాన్ కు చాలా కాలం త‌ర్వాత‌ మ‌రో స‌క్సెస్ ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ స‌హా టీమ్ అంతా ఎంతో సంతోషంగా ఉంది. గ్రాండ్ గా పార్టీలు చేసు కుంటున్నారు. టీమ్ అంతా క‌లిసి ఒక పార్టీ అయితే? సుజిత్ క్లోజ్ గా ఉన్న వాళ్ల‌తో మ‌రో పార్టీలోనూ పాల్గొం టున్నా డు. ఈ సంతోష స‌మ‌యంలోనే `ఓజీ`కి సీక్వెల్ కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా సీక్వెల్ విష‌యం లో ఎంతో సంతోషంగా ఉన్నారు. సుజిత్ లాంటి డైరెక్ట‌ర్ అప్పుడే త‌న‌కు తార‌స ప‌డి ఉంటే రాజ‌కీయాల్లోకే వ‌చ్చే వాడిని కాద‌న్నారు.

అంటే `ఓజీ` కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత‌గా బాండ్ అయ్యారు? అన్న‌ది అద్దం పడుతుంది. ఈక్ర‌మం లోనే ఇద్ద‌రు క‌లిసి భ‌విష్య‌త్ లో మ‌రిన్ని ప్రాజెక్ట్ లు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. తాజాగా సుజిత్ -త‌మ‌న్ త‌మ సంతోషాన్ని ఏకంగా ఖండాలే దాటించారు. తాజాగా డ‌ల్లాస్ లోనూ అభిమానుల స‌మ‌క్షంలో స‌క్సెస్ ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే `ఓజీ` సీక్వెల్ తో అకీరా నంద‌న్ లాంచ్ అవుతాడా? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. దానికి సుజిత్ సీక్వెల్ కాదు...ప్రీక్వెల్ అంటూ మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో `ఓజీ`కి సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ కూడా ఉంద‌న్న సంగ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

సీక్వెల్ అంటే `ఓజీ` ఎక్క‌డ ముగిసిందో అక్క‌డ నుంచి అదే హీరోతో మొద‌లు పెడ‌తాడు. ప్రీక్వెల్ అంటే `ఓజీ`కి ముందు జ‌రిగిన క‌థ చెప్పాలి. కాబ‌ట్టి ఆ క‌థ‌లో హీరోగా అకీరా నంద‌న్ ని తీసుకునే ఆలోచ‌న‌తోనే సుజిత్ అలా స్పందించాడా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి కంటెంట్ తోనే త‌న‌యుడు లాంచ్ అయితే బాగుంటుంద‌ని ప‌వ‌న్ కూడా ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రీక్వెల్ తో అది జ‌రిగితే ప‌వ‌న్ అభిమానుల ఆనందానికి అవ‌ధులుండ‌వ్.

ప‌వ‌న్ తో సీక్వెల్ కంటే ముందుగానే ప్రీక్వెల్ తీయాల‌ని అప్పుడే రిక్వెస్టులు మొద‌ల‌య్యాయి. అయితే అందుకు స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం సుజిత్ ..నాని హీరోగా ఓ సినిమా పూర్తి చేయాలి. ఆ త‌ర్వాతే కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించే అవ‌కాశం ఉంటుంది. వ‌చ్చే ఏడాది ఆ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ప్ర‌స్తుతం నాని `ది ప్యార‌డైజ్` పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. అది పూర్త‌యిన వెంట‌నే సుజిత్ సీన్ లోకి వ‌స్తాడు. అంత వ‌ర‌కూ `ఓజీ` కి సీక్వెల్ ఉండ‌దు..ప్రీక్వెల్ ఉండ‌దు.