యూఎస్.. బాక్సాఫీస్‌ను వణికిస్తున్న పవన్ కళ్యాణ్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీపై అంచనాలు హై లెవెల్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 4 Sept 2025 3:27 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీపై అంచనాలు హై లెవెల్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ మొదటి పోస్టర్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి అప్‌డేట్‌తో అభిమానుల్లో జోష్‌ను రెట్టింపు చేస్తోంది.
ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, సాంగ్స్, బర్త్‌డే స్పెషల్ పోస్టర్స్ ఊహించని హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఇంకా ట్రైలర్ రాకముందే బాక్సాఫీస్ వద్ద రికార్డులు వేటాడటం మాత్రం ఫ్యాన్స్‌కే కాకుండా ట్రేడ్ వర్గాలకు కూడా సర్ప్రైజ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల వాతావరణంలో, మేకర్స్ ఓజీని మరో స్థాయిలో నిలబెట్టే అప్‌డేట్స్‌ని వరుసగా విడుదల చేస్తున్నారు.
ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఓజీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఉత్తర అమెరికాలో రిలీజ్‌కు మూడు వారాల ముందే ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో 1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఇది అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. పవన్ క్రేజ్ ఓవర్సీస్‌లో ఏ రేంజ్‌లో ఉందో ఈ అప్‌డేట్‌తో మరోసారి తేలిపోయింది. హైప్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో సాగుతున్నాయి.
సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో అడుగు పెట్టబోతున్న ఓజీలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఈ పోస్టర్, గ్లింప్స్‌లలో ఆయన లుక్ చూసినవారంతా ఇది పవన్ కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు. పవన్ పవర్, సుజీత్ స్టైలిష్ ప్రెజెంటేషన్ కలిస్తే స్క్రీన్‌పై ఫైర్ అవుతుందన్న నమ్మకం పెరిగింది.
ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ అందిస్తున్న మ్యూజిక్ ఇప్పటికే ఫైర్‌స్టార్మ్ లెవెల్ హైప్ తెచ్చింది. థియేటర్లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పవన్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కలిస్తే ఫెస్టివల్ ఫీలింగ్ ఖాయం అని ట్రేడ్ అంచనా. మొత్తం మీద, రిలీజ్‌కు ముందు నుంచే పవన్ కళ్యాణ్ ఓజీతో బాక్సాఫీస్‌ను ఊపేస్తున్నారు. అమెరికాలో మొదలైన ఈ తుఫాను, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విస్తరించి రికార్డులు బద్దలు కొడుతుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో నెలకొంది. ఇక టోటల్ డే 1 ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.
