ట్రైలర్ రాకుండానే ఇంత హంగామానా ఓజీ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఓజి సినిమాపై కూడా మొదటినుంచి అలాంటి క్రేజే ఉంది.
By: Sravani Lakshmi Srungarapu | 20 Sept 2025 11:00 PM ISTకొన్ని సినిమాలకు ఉండే హైప్ గురించి చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఓజి సినిమాపై కూడా మొదటినుంచి అలాంటి క్రేజే ఉంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ సినిమా చేస్తున్నాడని చెప్పినప్పటి నుంచే ఓజిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం సుజిత్ పవన్ కు వీరాభిమాని అవడమే.
పవన్ ను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకుంటున్నారో సుజిత్ తమ హీరోను అలానే చూపిస్తాడని మొదటి నుంచి ఓజిపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సుజిత్ ఇప్పటివరకు ఓజికి తన నుంచి ది బెస్ట్ ఇస్తూనే వచ్చారు. ఓజి నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ లోనూ సుజిత్ కు పవన్ కళ్యాణ్ పై ఉన్న ఇష్టం, అభిమానం కనిపిస్తూనే ఉన్నాయి.
ఆకలిపై ఉన్న పవన్ ఫ్యాన్స్
ఓజి నుంచి రిలీజవుతున్న ప్రతీ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుండగా, ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ ను పూర్తి చేసుకున్న ఓజి కి సంబంధించిన బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఎంతో ఆకలిపై ఉన్న పవన్ ఫ్యాన్స్ ఓజి టికెట్స్ ఇలా పెట్టడం ఆలస్యం వెంటనే వాటిని బుక్ చేసి టికెట్ ముక్క లేకుండా ఖాళీ చేస్తున్నారు.
మారు మూల థియేటర్లలో కూడా ఫాస్ట్ ఫిల్లింగ్
తెలంగాణలో ఓజి బుకింగ్స్ భారీగా జరుగుతుండగా, హైదరాబాద్ లో ఈ బుకింగ్స్ హడావిడి ఇంకాస్త ఎక్కువగా ఉంది. కేవలం మెయిన్ సెంటర్లు, ఏరియాల్లోనే కాకుండా హైదరాబాద్ నలుమూలలా ఉన్న థియేటర్లలో కూడా ఓజి టికెట్ సేల్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ లో ఉన్నాయంటే పవన్ క్రేజ్, అతని ఫ్యాన్స్ ఆకలిని అర్థం చేసుకోవచ్చు. కనీసం ట్రైలర్ కూడా రిలీజవకుండానే ఓజికి క్రేజ్ ఈ రేంజ్ ఉందంటే ఇక ట్రైలర్ రిలీజయ్యాక ఈ సినిమా హడావిడి, టికెట్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో, దాని కోసం ఎన్ని కొత్త స్క్రీన్లు యాడ్ చేయాల్సి వస్తుందో చూడాలి.
