OG లో అకిరా.. అదే నిజమైతే మాత్రం..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ ఫిక్స్ చేసారు. సరిగ్గా నెల రోజుల్లో రిలీజ్ ఉంది కాబట్టి మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కి సిద్ధమవుతున్నారు.
By: Ramesh Boddu | 25 Aug 2025 10:28 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ ఫిక్స్ చేసారు. సరిగ్గా నెల రోజుల్లో రిలీజ్ ఉంది కాబట్టి మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కి సిద్ధమవుతున్నారు. ఐతే సినిమాకు ఒక నాలుగు రోజుల ప్యాచ్ వర్క్ పని ఉందట. అది పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ఇప్పటికే ఓజీ గ్లింప్స్ ఇంకా పవర్ స్టోర్మ్ సాంగ్ అంచనాలు పెంచగా త్వరలో మరో టీజర్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
అకిరా నందన్ ఉన్నాడంటూ..
ఐతే ఓజీ సినిమాలో పవర్ స్టార్ తనయుడు అకిరా నందన్ ఉన్నాడంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఓజీ నుంచి వచ్చిన పవర్ స్టోర్మ్ సాంగ్ లో కొన్ని షాట్స్ చూస్తే అది అకిరా నందన్ లానే అనిపిస్తున్నాడు. ఐతే సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర 3 దశల్లో కనిపిస్తుందట. టీనేజ్ రోల్ కూడా ఉంటుందని టాక్. అది పవన్ కళ్యాణ్ ప్లేస్ లో అకిరా నందన్ చేస్తున్నాడని అంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ చిన్నప్పటి రోల్ అకిరా చేస్తే మాత్రం ఇక ఫ్యాన్స్ కి ఫ్యూజులు అవుట్ అవుతాయని చెప్పొచ్చు.
సినిమాలో అకిరా ఉంటే ఓజీ డబుల్ ధమాకా అన్నట్టే లెక్క. సినిమాపై ఉన్న అంచనాలకు ఈ అప్డేట్స్ కూడా సూపర్ ఎగ్జైట్ మెంట్ అందిస్తున్నాయి. ఓజీ సినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తుంది. సుజిత్ ఈ సినిమాను చాలా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు. తప్పకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ ఫీస్ట్ అందించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
పవర్ స్టోర్మ్ సాంగ్..
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఓజీ సాంగ్స్, బిజిఎం కూడా థమన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ పవర్ స్టోర్మ్ సాంగ్ ఫ్యాన్స్ కి బాగా ఎక్కేసింది. నెక్స్ట్ సువ్వి సువ్వి సాంగ్ వస్తుంది. వినాయక చవితి సందర్భంగా ఆ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ దసరాకి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేందుకు ఓజీ వస్తుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు.
