OG: మరో స్వీట్ సర్ ప్రైజ్ ఏమిటంటే..
సినిమా అనౌన్స్ మెంట్ నుంచి సినిమాపై ఏర్పడ్డ ఫుల్ హైప్ వల్ల ఫ్యాన్స్ బిగ్ స్క్రీన్ పై పవను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు.
By: M Prashanth | 24 Sept 2025 12:57 PM ISTమరికొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ సినిమా ఓజీ థియేటర్లలోకి రానుంది. సినిమా అనౌన్స్ మెంట్ నుంచి సినిమాపై ఏర్పడ్డ ఫుల్ హైప్ వల్ల ఫ్యాన్స్ బిగ్ స్క్రీన్ పై పవను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే వాళ్ల ఎదురుచూపులకు తెర పడనుంది. చాలా కాలం తర్వాత పవన్ నుంచి ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఫిల్మ్ వచ్చింది.
పైగా ఇది మాఫీయా బ్యాక్ గ్రౌండ్ కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ట్రైలర్ చూసిని తర్వాత ఇది ఇంకా ఎక్కువైంది. పవన్ చేసే యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగులు, ఫైట్లు చూడాలని అభిమానులతోపాటు సినీ లవర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఆయన డైలాగులకు, ప్రకాశ్ రాజ్ ఎదురుపడ్డప్పుు సీన్స్ కు అయితే విజిల్స్ పక్కా. అయితే అందరూ పవన్ యాక్షన్ సీన్స్ కోసమే కాదు.. కొంతమంది వింటేజ్ పవన్ ను కూడా చాడాలని ఆశిస్తున్నారు.
అదృష్టం కొద్దీ ఇందులో ఆ యాంగిల్ కూడా ఉంది. సువ్వి సువ్వి పాటతో ఇందులో రొమాంటిక్ యాంగిల్, లవ్ ట్రాక్ కూడా ఉండనున్నట్లు సుజీత్ చెప్పకనే చెప్పాడు. ఇక గన్స్ అండ్ రోజెస్ పాటతో ఆత్రుత మరింత పెరిగింది. దీంతో ఒక వర్గం పవన్ ఫ్యాన్స్ ఆయన లవ్ స్టోరీ, ఫ్యామిలీ మ్యాన్ గా చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇది పవన్ లేడీ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది.
అంతేకాకుండా ఈ సినిమా లవ్ ట్రాక్ 80ల్లో సాగనుంది. ట్రైలర్ లో ప్రియాంక లుక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో లవ్ ట్రాక్ కు కూడా పవన్ వాయిస్ అందించారని తెలిసింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఖుషి సినిమా రోజుల్లోకి వెళ్లిపోతున్నారు. ఎప్పుడెప్పుడు పవన్ ను జోవియల్, లవర్ బాయ్ మోడ్ లో చూస్తామా అని తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ యాంగిల్ తో మాస్ ఆడియెన్స్ నే కాదు సుజిత్ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. దీంతో థియేటర్లకు పవన్ లేడీ ఫ్యాన్స్ తాకిడి కూడా ఎక్కువగా ఉండడం పక్కాగా కనిపిస్తుంది.
సుజిత్ క్రియేట్ చేసిన లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ లేడీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటే, ఓజీకి కచ్చితంగా రిపీటెడ్ ఆడియెన్స్ కౌంట్ పెరుగుతుంది. ఇది కలెక్షన్లు సాధించడంలో యూజ్ అవుతుంది. అయితే, సోషల్ మీడియా బజ్ ప్రకారం.. ప్రియాంక పాత్రకు లిమిటెడ్ స్క్రీన్ రన్ టైమ్ ఉంటుందని తెలుస్తోంది. కానీ సినిమా రిలీజ్ అయే దాకా దీనిపై స్పష్టత రాదు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఒకరోజు ముందు అంటే ఇవాళ రాత్రి తెలుగు రాష్ట్రాల్లో 10 గంటలకు ప్రీమియర్స్ పడనున్నాయి.
