OG ట్రైలర్ కి లేట్ ఏంటి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మరో వారంలో రిలీజ్ కాబోతుంది. ఐతే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటివరకు వదల్లేదు.
By: Ramesh Boddu | 18 Sept 2025 10:56 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మరో వారంలో రిలీజ్ కాబోతుంది. ఐతే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటివరకు వదల్లేదు. అసలైతే సెప్టెంబర్ 17, 18 తేడీల్లో ఓజీ ట్రైలర్ వస్తుందని అన్నారు. కానీ అది ఇంకా లేట్ అవుతుంది. ఓజీ ట్రైలర్ రిలీజ్ పై ఎందుకు చిత్ర యూనిట్ వెనకడుగు వేస్తున్నారన్నది తెలియట్లేదు. ఓజీ సినిమా ట్రైలర్ తోనే సినిమాపై హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అందుకే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గన్స్ అండ్ రోజెస్ సాంగ్..
రిలీజ్ ఇంకా వారం రోజులే ఉన్న టైం లో దర్శక నిర్మాతలు ఎందుకు ఇలా చేస్తున్నారన్న డౌట్ మొదలైంది. ఐతే ఓజీ సినిమా ట్రైలర్ ఒక్కటి రాలేదు కానీ పవర్ స్టోర్మ్ సాంగ్, సువ్వి సువ్వి సాంగ్, గన్స్ అండ్ రోజెస్ సాంగ్ వచ్చి సినిమాను ఒక రేంజ్ లో లేపాయి. గన్స్ అండ్ రోజెస్ సాంగ్ అయితే థియేటర్లో దుమ్ము దులిపేలా ఉంది. ఎలాగు సాంగ్స్ తో బజ్ వచ్చింది కాబట్టి ట్రైలర్ ని డైరెక్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే వదిలే ప్లానింగ్ లో ఉన్నారట.
ఓజీ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. సినిమాకు ఏ వస్తుందని అనుకుంటే యు/ఏ ఇచ్చారు. ఇక ఓజీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ముందు విజయవాడలో ఈ నెల 20న నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మారిందని టాక్. హైదరాబాద్ లోనే ఓజీ ప్రీ రిలీజ్ వేడుక ఉంటుందట. ఆ డేట్ కూడా 22, 23 అలా ఉంటుందని టాక్.
వింటేజ్ పవన్ కళ్యాణ్ ని..
ఓజీ సినిమాలో పవర్ స్టార్ లుక్, స్వాగ్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపించేలా ఉన్నాడని డైరెక్టర్ సుజిత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే రిలీజ్ ముందు అంచనాలు ఎలా ఉన్నా రిలీజ్ తర్వాత సుజీత్ వర్క్ గురించి డిస్కషన్ చేస్తారు. ఓజీ సినిమాకు థమన్ డబుల్ డ్యూటీ చేస్తున్నాడు.
సినిమాలో తెర మీద పవర్ స్టార్ ఎలా ఐతే మేజర్ హైలెట్ అవుతాడో.. ఆఫ్ స్క్రీన్ లో థమన్ కూడా అదే రేంజ్ లో సత్తా చాటుతాడట. ఓజీ ట్రైలర్ ఒక్కటి వస్తే సినిమా పై అంచనాలు ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓజీ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాస్ స్టామినా నేషనల్ లెవెల్ లో తెలుస్తుందని అంటున్నారు.
