పవన్ OG.. అందరూ అది ఫాలో అయితేనే!
తద్వారా ధరలు పెంచి సినిమాను రిలీజ్ చేశారు. అయితే వాటి వల్ల ఫుల్ ఫాల్ తగ్గిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ముఖ్యంగా దసరా సెలవులు నడుస్తున్నా.. పండుగ కూడా వస్తోంది..
By: M Prashanth | 28 Sept 2025 12:46 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో రూపొందిన ఓజీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా.. పవన్ అభిమానులను తెగ మెప్పిస్తోంది. మిగతా మూవీ లవర్స్ ను కాస్త అప్సెట్ చేసినా ప్రస్తుతం సందడి మాత్రం పర్లేదనిపించేలా చేస్తోంది.
ఇప్పటి వరకు మూడు రోజులకు గాను రూ.200 కోట్లకు పైగా ఓజీ మూవీ వసూలు చేయగా.. నేడు సండే కాబట్టి మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. అయితే వీకెండ్స్ లో మళ్లీ ఫ్యాన్సే ఎక్కువ సందడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. నార్మల్ ఆడియన్స్.. ఓజీ మూవీ చూడాలని ఉన్నా.. థియేటర్స్ రావడం లేదని టాక్ వినిపిస్తోంది.
అందుకే ఆక్యుపెన్సీ తగ్గినట్లు కనిపిస్తుంది. దాని ముఖ్య కారణం టికెట్ రేట్లు అనే చెప్పాలి. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మేకర్స్.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టికెట్ ధరలు పెంచేందుకు జీవోలు అందుకున్నారు మేకర్స్. సుమారు పది రోజుల పాటు పెంచిన ధరలు కొనసాగించేందుకు కూడా అనుమతులు అందుకున్నారు.
తద్వారా ధరలు పెంచి సినిమాను రిలీజ్ చేశారు. అయితే వాటి వల్ల ఫుల్ ఫాల్ తగ్గిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ముఖ్యంగా దసరా సెలవులు నడుస్తున్నా.. పండుగ కూడా వస్తోంది.. కాబట్టి ధరలు కాస్త తక్కువ ఉంటే ఎక్కువ మంది ఆడియన్స్ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందరూ ఎక్కువ డబ్బులు పెట్టలేరు కదా!
అయితే ఇప్పుడు మేకర్స్ టికెట్ రేట్స్ తగ్గించకపోయినా.. పలు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లు తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఈస్ట్ గోదావరిలో రూ.200 కే టికెట్స్ సేల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మంచి రెస్పాన్స్ వస్తుండడంతో.. మిగతా డిస్ట్రిబ్యూటర్ల ఫోకస్ అటు పడినట్లు సమాచారం. వారు కూడా అదే ఫాలో అవ్వాలని చూస్తున్నట్లు వినికిడి.
అదే సమయంలో వీకెండ్ లో సినిమా స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధించాలన్నా కూడా రేట్లు తగ్గించడం ముఖ్యమనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్ లా అందరూ ఫాలో అయితే బెటర్ అని అంటున్నారు. అప్పుడే లాంగ్ రన్.. మరింత సక్సెస్ ఫుల్ గా నడుస్తుందని అంటున్నారు. మరి మిగతా డిస్ట్రిబ్యూటర్లందరూ ఏం చేస్తారో వేచి చూడాలి.
