Begin typing your search above and press return to search.

పిక్ టాక్: OG అమ్మాయి.. సో కూల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "ఓజీ" సినిమా చుట్టూ రోజురోజుకు క్రేజ్ మరింత పెరుగుతోంది.

By:  M Prashanth   |   16 Aug 2025 5:04 PM IST
పిక్ టాక్: OG అమ్మాయి.. సో కూల్!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "ఓజీ" సినిమా చుట్టూ రోజురోజుకు క్రేజ్ మరింత పెరుగుతోంది. సుజీత్ దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే ఒక రికార్డ్ గా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.


పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపిస్తుండటమే కాకుండా, ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక సంగీతం తమన్ అందిస్తుండటంతో ఇప్పటికే విడుదలైన "ఫైర్ స్టార్మ్" పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.


కన్మణిగా ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్

లేటెస్ట్ గా విడుదలైన "ఓజీ" పోస్టర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఆమె ‘కన్మణి’ పాత్రలో కనిపించనుంది. పోస్టర్స్‌లో ఒకవైపు ఆమె సాంప్రదాయ లుక్‌లో గృహిణి లా మెస్మరైజ్ చేస్తుంటే, మరో పోస్టర్‌లో ప్రశాంతతతో కూడిన క్లాస్ వైబ్ ఇచ్చింది. ఈ లుక్ చూసిన నెటిజన్లు సో కూల్, పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ పవన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఫస్ట్ లుక్‌తో పాటు ప్రియాంక పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ హింట్ కూడా ఇచ్చినట్టే. గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఇంత కూల్ లేయర్ ఇవ్వడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. పవన్ కళ్యాణ్ పవర్‌పుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రియాంక అరుల్ మోహన్ క్యూట్ గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

తాజాగా వచ్చిన ఈ పోస్టర్లతో పాటు, సినిమా ప్రమోషన్స్ మరింత వేగం పుంజుకున్నాయి. ఓజీ రెండో పాట త్వరలోనే విడుదల కానుందని, ప్రోమో సిద్ధంగా ఉందని సమాచారం. ఫస్ట్ సాంగ్‌కు లభించిన స్పందన దృష్ట్యా, రెండో పాట కోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇక టెక్నికల్ వైపు చూసుకుంటే సినిమాటోగ్రాఫర్లు రవికే చంద్రన్, మనోజ్ పరమహంస వర్క్ ఇప్పటికే ప్రశంసలు అందుకుంటోంది. ఎడిటర్ నవీన్ నూలి కట్ చేస్తున్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ మిక్స్ అవుతుందని ట్రేడ్ అంచనా. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా టాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద ఈవెంట్‌గా నిలవబోతోంది.