Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ కు షాక్.. ఓజీకి నో ప్రీమియర్స్ కానీ...

పపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఓజీ సినిమ ప్రీమియర్లకు రెడీ అవుతున్న మెగా ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్త ఇది.

By:  M Prashanth   |   16 Sept 2025 3:57 PM IST
మెగా ఫ్యాన్స్ కు షాక్.. ఓజీకి నో ప్రీమియర్స్ కానీ...
X

పపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఓజీ సినిమ ప్రీమియర్లకు రెడీ అవుతున్న మెగా ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్త ఇది. సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో ముందు రోజు అంటే 24న రాత్రి ప్రీమియర్స్ షోలు ఉంచాయని ఫ్యాన్స్ భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 25న రాత్రి ప్రత్యేక షోలు ఉండకపోవచ్చని, బదులుగా తెల్లవారుజామున 1 లేదా 4 గంటల నుంచి స్క్రీనింగ్స్ ఉంటాయని తెలుస్తోంది.

ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు అనధికారిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్టైన్‌ మెంట్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, అనుమతులు, టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు నిర్మాణ సంస్థ నుంచి కొత్త సమాచారం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం ప్రీమియర్ షోలపై భారీ ప్లాన్స్ వేసుకున్నారు. హైదరాబాద్ మల్కాజ్‌ గిరిలోని ఒక సింగిల్ స్క్రీన్ కోసం ఏకంగా టన్ను పేపర్స్ కట్టింగ్స్ సిద్ధం చేశారట.

కాగా, మొదటి టికెట్‌ను లక్ష రూపాయలకు వేలం వేసి అమ్మిన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ షోలు రద్దయితే, అభిమానులకు మాత్రం నిరాశ తప్పదు. అయితే జనసేన పార్టీ విరాళాల కోసం ఈ ఏర్పాట్లు జరిగినందున పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ షోలు ఎప్పటి నుంచి మొదలవుతాయనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం ఓజీ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్తా సంచలనంగా మారుతోంది. ఓపెనింగ్స్ భారీ స్థాయిలోనే ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ స్టామినాను ప్రపంచానికి చాటే సినిమాగా ఓజీ నిలుస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఓవర్సీస్ బుకింగ్స్ చూస్తే తెలిసిపోతుంది. అక్కడ ఇప్పటికే 50 వేల టికెట్లు సోల్డ్ అయ్యాయి. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ కు ముందే ఓజీ పలు రికార్డులు బ్రేక్ చేస్తుందని అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

దర్శకుడు సుజిత్ అందిస్తున్న కంటెంట్, తమన్ సంగీతం సినిమా హైప్‌ ను మరింత పెంచుతున్నాయి. ఈ సినిమా ముంబయి బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరరెక్కింది. ఇమ్రాన్ హష్మి విలన్ గా నటించారు. ఇక హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది. ఇక మేకర్స్ త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈనెల 20న విజయవాడ లేదా హైదరాబాద్‌ లో గ్రాండ్ గా ప్రీ- రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.