OG లీక్.. థమన్ చెబితే డైరెక్టర్ షాకింగ్ రియాక్షన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఈ సెప్టెంబర్ 25కి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పవర్ స్టార్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు వస్తున్నారు.
By: Ramesh Boddu | 2 Aug 2025 12:01 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఈ సెప్టెంబర్ 25కి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పవర్ స్టార్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు వస్తున్నారు. సుజిత్ ఈ సినిమాను చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఓజీ గ్లింప్స్ తోనే థమన్ సినిమా మ్యూజిక్ లెక్క ఏంటన్నది చూపించాడు. తెలుగు సినిమా రేంజ్ ఏంటన్నది ఈ సినిమా తో చూపిస్తా అంటున్నాడు థమన్.
OG సినిమా నుంచి ఫస్ట్ సాంగ్..
కొత్త రకం మ్యూజిక్ తో ఓజీ మ్యూజిక్ కోసమే రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేలా చేస్తున్నారట. ఇక ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ పవర్ స్టోర్మ్ రిలీజ్ కాబోతుంది. ఐతే ఈ సాంగ్ రిలీజ్ కాకుండానే లీక్ అయ్యిందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సుజిత్ కి కాల్ చేశాడు. నువ్వు ఒక్కడివే ఉన్నావా అంటూ అడిగి.. థమన్ కంగారుగా సుజిత్ కి పవర్ స్టోర్మ్ లీక్ అయ్యింది. వాట్సాప్ ద్వారా లీక్ అయ్యింది అనుకుంట. శింబు ఏమన్నా చేశాడేమో అంటూ సుజిత్ తో కాస్త టెన్షన్ గా మాట్లాడాడు. ఐతే సుజిత్ మాత్రం అవునా అలా ఎలా అయ్యింది అంటూ కూల్ గా మాట్లాడాడు.
ఆ తర్వాత థమన్ నవ్వేసి ఇది జస్ట్ ప్రాంక్ అని చెప్పాడు. ఓజీ సాంగ్ పై థమన్ ప్రాంక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐతే సుజిత్ మాత్రం షాక్ తినకుండా లీక్ అయినా మనం ఏం చేస్తామని అనడం విశేషం. సుజిత్ ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అన్నది అతని వాయిస్ లోని కాన్ఫిడెన్స్ చూస్తే తెలుస్తుంది.
థమన్ ఫుల్ ఆన్ డ్యూటీ..
స్వతహాగా పవర్ స్టార్ అభిమాని అయిన సుజిత్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ లో పవర్ స్టార్ స్టైల్ వింటేజ్ డేస్ గుర్తు చేస్తుందట. అంతేకాదు మ్యూజిక్ పరంగా థమన్ ఫుల్ ఆన్ డ్యూటీ చేశాడని టాక్. విజువల్స్, యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ ఒక హాలీవుడ్ లెవెల్ సినిమా అప్పీల్ చేశారట. తప్పకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ ఒక సంచలనం అవుతుందని ఫిక్స్ అయ్యారు పవర్ స్టార్ ఫ్యాన్స్.
ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలోని పవర్ స్టోర్మ్ సాంగ్ ఈరోజు రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఓజీ సినిమాతో థమన్ తన బ్రాండ్ వాల్యూ మరింత క్రేజ్ తెచ్చుకునేలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది.
