Begin typing your search above and press return to search.

పవన్, తమన్, సుజీత్.. స్పెషల్ 'మూమెంట్' చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   30 Sept 2025 3:39 PM IST
పవన్, తమన్, సుజీత్.. స్పెషల్ మూమెంట్ చూశారా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఓజీ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు.

సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలైన ఓజీ.. ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సక్సెస్ ఫుల్ గా తొలి వారాన్ని పూర్తి చేసుకోనుంది. అయితే ఇప్పుడు పవన్, తమన్, సుజీత్ సూపర్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులను ఆ పిక్ తెగ ఆకట్టుకుంటోంది.

పవన్, తమన్, సుజీత్ ముగ్గురూ చేతులను పైకెత్తి పట్టుకుని విన్నింగ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు. ముగ్గురూ హార్ట్ ఫుల్ గా నవ్వుతూ పోజు ఇచ్చారని చెప్పాలి. అయితే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు అసలైన హీరోలు తమన్, సుజీత్ అని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వారితో పిక్ దిగడం విశేషం.

ఓజీ సినిమాను ఇటీవల మెగా కుటుంబమంతా కలిసి వీక్షించిన వేళ.. ఆ మూమెంట్ జరిగింది. స్పెషల్ షో అయ్యాక అంతా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఓజీ చిత్రాన్ని చూశారు. మెగా ఫ్యామిలీ మూడో తరం హీరోలు, పిల్లలు కూడా ఓజీ స్పెషల్ స్క్రీనింగ్ కు అటెండ్ అయ్యారు.

ఆ తర్వాత అంతా థియేటర్ లో ఓ చోట ఉండి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలో పవన్, ఓజీ టీమ్ తో చిరంజీవి, రామ్ చరణ్ సహా మెగా ఫ్యామిలీ అంతా ఫోటోలు దిగారు. వాటిని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పిక్స్ అన్నీ అందరినీ అట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి.

కుటుంబంతో పాటు, ఓజీ మూవీ యూనిట్‌ తో కలిసి థియేటర్‌లో దిగిన ఫొటోలను చిరంజీవి కూడా షేర్ చేశారు. సినిమాపై స్పెషల్ రివ్యూ ఇచ్చారు. అభిమానులకు కావాల్సిన వినోదాల విందును పవన్‌ ఇచ్చారని కొనియాడారు. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్‌ వరకూ ప్రతి సీన్ ను సుజీత్‌ అసాధారణరీతిలో రూపొందించారని ప్రశంసించారు. తమన్‌ చిత్రానికి ఆత్మతో సమానమంటూ ఆకాశానికెత్తేశారు.