OG అన్నీ టాప్ లేపేస్తున్నాయ్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ట్రెండింగ్ లో ఉంటున్నాయి.
By: Ramesh Boddu | 28 Aug 2025 12:35 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ముఖ్యంగా థమన్ ఈ సినిమాకు ఫుల్ ఆన్ డ్యూటీ చేస్తున్నాడు. ఓజీ సినిమా విషయంలో థమన్ స్పెషల్ ఇంట్రెస్ట్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ తెప్పిస్తుంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే సూపర్ అనిపించేశారు. ఫస్ట్ గ్లింప్స్ తో పవర్ స్టార్ రేంజ్ గ్యాంగ్ స్టర్ మూవీ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ సూపర్ అనేశారు.
పవర్ స్టోర్మ్ సాంగ్..
ఇక అప్పటి నుంచి OG.. OG అంటూ పూనకాలతో ఉన్నారు. ఇక రిలీజైన పవర్ స్టోర్మ్ సాంగ్ అయితే పీక్స్ అనిపించింది. ఆ సాంగ్ చూసిన ఫ్యాన్స్ అయితే ఎఫ్.డి.ఎఫ్.సీ తోనే రికార్డులు షురూ అనుకున్నారు. ఇక లేటెస్ట్ గా OG నుంచి వినాయక చవితి సందర్భంగా సువ్వి సువ్వి సాంగ్ రిలీజైంది. ఓజీ లో ఇలాంటి మంచి ఫీల్ గుడ్ మెలోడీ ఎక్స్ పెక్ట్ చేయలేదు ఆడియన్స్.
సో సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు కావాల్సినవి అన్నీ ఉన్నాయని అనిపించేలా ఉంది. ఓజీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఓజీ సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు ఇష్టపడేలా సుజిత్ తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటికే పవర్ స్టోర్మ్ సాంగ్ లో కొన్ని క్లిప్స్ ఫ్యాన్స్ కి సూపర్ హై ఇస్తున్నాయి.
పవర్ స్టార్ ఫ్యాన్స్ OG కోసం..
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓజీ కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఐతే ఈ సినిమాపై యూఎస్ లో సూపర్ బజ్ ఉంది. అందుకే సినిమాకు అక్కడ రిలీజ్ నెల ముందే టికెట్స్ సేల్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ మేకోవర్ ఫ్యాన్స్ కి కావాల్సినంత ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు.
సాహో తర్వాత సుజిత్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సంథింగ్ స్పెషల్ గా ఓజీ ప్లాన్ చేస్తున్నాడు. స్వతహాగా పవర్ స్టార్ ఫ్యాన్ అయిన సుజిత్ ఈ సినిమాను పవర్ ప్యాక్డ్ గా చేస్తున్నారు. సినిమా నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా అదరగొడుతుంది. మరి సెప్టెంబర్ 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
