Begin typing your search above and press return to search.

ఓజీ రన్ టైమ్ లాక్.. ఎంతంటే?

లేటెస్ట్ సమాచారం ప్రకారం ఓజీ సినిమా మొత్తం 156 నిమిషాల నిడివితో రాబోతోందని తెలుస్తోంది.

By:  M Prashanth   |   18 Sept 2025 7:07 PM IST
ఓజీ రన్ టైమ్ లాక్.. ఎంతంటే?
X

టాలీవుడ్‌లో ప్రస్తుతం హైపెస్ట్‌లో ఉన్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజీ”. విడుదలకు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఓవర్సీస్‌ లో అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రీసెంట్‌గా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయినట్లు టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే సినిమా నిడివి పై ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం ఓజీ సినిమా మొత్తం 156 నిమిషాల నిడివితో రాబోతోందని తెలుస్తోంది. అంటే రెండు గంటల 36 నిమిషాలపాటు పవన్ కళ్యాణ్ మ్యాజిక్, యాక్షన్, ఎమోషన్ ఫుల్‌గా కనువిందు చేయబోతోంది. ఒక యాక్షన్ డ్రామా జానర్‌కి ఇది సరైన నిడివి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీని పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. ఇప్పటికే థమన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ క్రియేట్ చేశాయి. ప్రత్యేకంగా ఫైర్ స్టోర్మ్, సువ్వి సువ్వి ట్రాక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ ఓమి మ్యూజిక్ కూడా హైప్‌ను రెట్టింపు చేసింది.

సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండటంతో భారీ ప్రొడక్షన్ విలువలు కనిపించనున్నాయి. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించడం సినిమా హైలైట్ కానుంది. హీరో విలన్ మధ్య క్లాష్‌లు అద్భుతంగా డిజైన్ చేశారని మేకర్స్ చెబుతున్నారు.

అలాగే ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరిశ్ ఉత్థమన్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌ను అగ్రెసివ్‌గా ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 18న ట్రైలర్ రిలీజ్, సెప్టెంబర్ 20న ఆంధ్రప్రదేశ్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారనే వార్త ఫ్యాన్స్‌కి డబుల్ బోనస్‌గా మారింది. రిలీజ్‌కు ముందు పవన్ స్వయంగా మూడు రోజుల పాటు ప్రమోషన్లలో పాల్గొనబోతున్నారని కూడా సమాచారం. ఇప్పటికే ఉన్న హైప్, అంచనాలకు తగ్గట్టే సినిమా కంటెంట్ ఉంటే బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. దసరా కానుకగా పవర్ స్టార్ అభిమానులకు ఇది మరిచిపోలేని విజువల్ ఫీస్ట్ అవుతుందని చెప్పవచ్చు.