ఓజీ సేల్ షురూ.. హాట్ కేకుల్లా టికెట్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫుల్ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా ఓజీ. తొలి వీడియో గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది.
By: M Prashanth | 28 Aug 2025 2:56 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫుల్ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా ఓజీ. తొలి వీడియో గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది. సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కు ఇది రెండీ అవుతోంది. అంటే ఇంకా నాలుగు వారాల సమయం ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు.
సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో నార్త్ అమెరికాలో టికెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడైపోయాయి. దీనికి ఉన్న హైప్ తో బుకింగ్స్ ఓపెన్ చేయగా లిమిటెడ్ సెంటర్స్ లో టికెట్లన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి. బుకింగ్ సేల్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 80వేల డాలర్ల కలెక్షన్లు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో సాధించినట్లు తెలుస్తోంది. తక్కువ లోకేషన్స్ లోనే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయట. ఇంకా రిలీజ్ కు నాలుగు వారాల టైమ్ ఉండడంతో వసూళ్లు భారీగా పెరగడం పక్కా!
ఓజీకి ఉన్న హైప్ తో ఇది అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అనేక రికార్డులు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది టాలీవుడ్ హిస్టరీలోనే టాప్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ రీసెంట్ చిత్రం హరిహర వీరమల్లు బుకింగ్స్ దాటేయడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే పవన్ ఫ్యాన్స్ ఏళ్ల తరబడి ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది ఒకటి.
అందుకే జస్ట్ ఓపెనింగ్ షో నాడు మౌత్ టాక్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడం పక్కా. ఇది పవన్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు చేసే సినిమానూ నిలిచే ఛాన్స్ ఉంది. ఇక నెలలోపే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేశారు. ఫైర్ స్ట్రోమ్ ఫుల్ ఫైర్ తో ఉండగా, నిన్న రిలీజైన మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది.
కాగా, త్వరలోనే సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇది రిలీజ్ అయ్యాక సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవ్వడం పక్కా. దర్శకుడు సుజిత్ ఈ సినిమాను ముంబయి బ్యాక్ డ్రాప్, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండా, తమన్ సందీతం అందిస్తున్నారు. డీవీవీ బ్యానప్ పై దానయ్య నిర్మిస్తున్నారు.
