పవర్ స్టార్ ఫ్యాన్స్ కు భారీ నిరాశ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడొస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న సినిమా ఓజి.
By: Sravani Lakshmi Srungarapu | 9 Sept 2025 6:34 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడొస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న సినిమా ఓజి. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చూడ్డానికి ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఆ ఎగ్జైట్మెంట్ తోనే ఆడియన్స్ హరి హర వీర్లమల్లు ప్రమోషన్స్ టైమ్ లో కూడా ఓజి గురించి అప్డేట్స్ అడుగుతూ వచ్చారు.
పవన్ ఫ్యాన్స్ కు నిరాశ
ఇప్పటికే ఓజి సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా, ఇప్పుడు యూఎస్ లోని ఫ్యాన్స్ కు ఓ చేదు వార్తను వెల్లడించారు. ఓజి సినిమా యూఎస్ఏలో ప్రత్యంగిర సినిమాస్ ద్వారా రిలీజవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రత్యంగిర సినిమాస్ ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ పవన్ ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేసింది. ఓజి కు ఐమాక్స్, DBoxtech, 4DX, డాల్బీ ఫార్మాట్లు ఉండవని ప్రత్యంగిర సినిమాస్ కన్ఫర్మ్ చేసింది.
కేవలం PLF, స్టాండర్డ్ ఫార్మాట్స్‌లోనే ఓజి
హాలీవుడ్ టైటిల్స్ తో మందుగా చేసుకున్న కమిట్‌మెంట్స్ వల్ల ఓజికి ఈ ఫార్మాట్లు ఏవీ ఉండవని, ఓజి సినిమా కేవలం ప్రీమియమ్ లార్జ్ ఫార్మాట్(PLF) మరియు స్టాండర్డ్ ఫార్మాట్స్ లో ప్రదర్శించబడుతుందని తెలిపారు. ఓజి నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లు, టీజర్లు, లిరికల్ వీడియోలు మంచి క్వాలిటీతో రావడం చూసి ఆశ్చర్యపోయిన ఫ్యాన్స్ సినిమాను కూడా ఐమాక్స్ వెర్షన్ లో చూడాలని ఆశపడ్డారు.
ఆల్రెడీ ఓజిపై భారీ హైప్
కానీ ఇప్పుడు ప్రత్యంగిర సినిమాస్ అనౌన్స్‌మెంట్ తో వారి ఆశలన్నీ నిరాశగా మారాయి. అయితే ఓజికి ఐమాక్స్ ఫార్మాట్ లేదని తెలుసుకున్న ఫ్యాన్స్ కొందరు డిజప్పాయింట్ అవగా, మరికొందరు పవన్ సినిమాకు ఐమాక్స్ ఫార్మాటే కావాలా స్టాండర్డ్ ఫార్మాట్ సరిపోతుందని, పవన్ సినిమా రిలీజవడమే పెద్ద సెలబ్రేషన్ అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఓజి సినిమాకు కావాల్సినంత బజ్ ఉంది. ట్రైలర్ రిలీజయ్యాక ఆ బజ్ ఇంకా పెరిగే అవకాశముంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, డీవీవీ దానయ్య ఓజిని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
