ఓజీ నైజాం రికార్డు.. టాప్ 10లో నెంబర్ 2!
అల్లు అర్జున్ సినిమా నైజాంలో 25.40 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు ఓజీ 24.42 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.
By: M Prashanth | 26 Sept 2025 3:16 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీకి నైజాం ఏరియా ప్రధాన ఆయువుపట్టు. ఎక్కువ షేర్ రబట్టగలిగే స్టార్స్ ఎప్పటికప్పుడు పాత రికార్డులు బ్రేక్ చేస్తుంటారు. ఇక OG సినిమాతో పవర్ స్టార్ కూడా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సినిమా విడుదలైన మొదటి షో నుంచే ఫ్యాన్స్ జోష్ మరింత పెరిగింది, టాక్ మిక్స్‌డ్ అయినా కలెక్షన్లలో మాత్రం పవన్ పవర్ ఘనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో సినిమా స్టార్ట్ పవర్ ఫుల్‌గా ఉండటం ట్రేడ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఓజీ సినిమా నైజాంలో మొదటి రోజే 24.42 కోట్ల షేర్ సాధించింది. ఇందులో ప్రీమియర్స్, GST కలిపి ఉన్నాయని చెబుతున్నారు. ఈ సంఖ్యతో ఆల్ టైమ్ రికార్డుల్లో టాప్ 2 స్థానానికి చేరింది. గత సినిమాలు అంతగా ఆడకున్నా కూడా పవన్ కళ్యాణ్ పై ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదని చెప్పవచ్చు. ఇక మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు అన్నిటిలోనూ హౌస్‌ఫుల్ షోలు నడుస్తున్నాయని తెలుస్తోంది.
దసరా హాలిడే సీజన్ కూడా మొదలవ్వడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో టాప్ 1 స్థానంలో పుష్ప 2 నిలిచింది. అల్లు అర్జున్ సినిమా నైజాంలో 25.40 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు ఓజీ 24.42 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.
మిగతా రికార్డులు కూడా చూస్తే, RRR, దేవర, సలార్ సినిమాలు కూడా మంచి వసూలు చేసి టాప్ 5లో నిలిచాయి. గతంలో రాజమౌళి సినిమాలు, ప్రభాస్ సాహో, కల్కి, మహేష్ గుంటూరు కారం లాంటి సినిమాలు కూడా బలమైన ఓపెనింగ్స్ సాధించాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో పవన్ ఓజీ తన స్థానాన్ని బలంగా సంపాదించుకుంది.
నైజాం డే వన్ టాప్ 10 షేర్స్ (ట్రేడ్ అంచనాల ప్రకారం)
పుష్ప 2: 25.40 కోట్లు
OG: 24.42 కోట్లు
RRR: 23.30 కోట్లు
దేవర: 22.60 కోట్లు
సలార్: 20.55 కోట్లు
కల్కి 2898 AD: 19.60 కోట్లు
గుంటూరు కారం: 16.90 కోట్లు
ఆదిపురుష్: 13.68 కోట్లు
సర్కారు వారి పాట: 12.24 కోట్లు
హరిహర వీరమల్లు: 12.15 కోట్లు
ఈ లిస్ట్ చూస్తే పవన్ కళ్యాణ్ పవర్ మళ్లీ రుజువైందని చెప్పొచ్చు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. కథ, టాక్ మీద మిక్స్ డ్ రియాక్షన్స్ వచ్చినా, కలెక్షన్లలో మాత్రం పవన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్ సెలవులు, దసరా సీజన్ కలిసి రావడంతో వసూళ్లు ఇంకా పెద్ద రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.
