Begin typing your search above and press return to search.

"వాషి యో వాషి".. ఓజీలో పవన్ పాడిన ఈ పాటకు ఇంత అర్థం ఉందా?

ఇకపోతే ఈ సినిమాలో ప్రతి అంశము కూడా అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాడిన పాట అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Madhu Reddy   |   27 Sept 2025 5:26 PM IST
వాషి యో వాషి.. ఓజీలో పవన్ పాడిన ఈ పాటకు ఇంత అర్థం ఉందా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అయిన తర్వాత కూడా అభిమానులను ఆకట్టుకోవడానికి వరుస సినిమాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే జ్యోతికృష్ణ డైరెక్షన్లో వచ్చిన 'హరిహర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఈ సినిమాతో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో ఓజీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజే రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ పాత్ర పోషించారు. ఈ పాత్ర చూసిన నెటిజన్స్ కూడా బాలీవుడ్ ఒక గొప్ప నటుడుని ఉపయోగించుకోవడంలో విఫలం అయింది అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. మరొకవైపు ఇందులో శ్రేయ రెడ్డి, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ , అర్జున్ దాస్, రాజ్ ఇలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో రన్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో ప్రతి అంశము కూడా అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాడిన పాట అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు." వాషి యో వాషి" అంటూ సాగిన ఈ పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇది జపనీస్ సాంగ్ కావడంతో మన తెలుగు వాళ్లకు పెద్దగా అర్థం కాలేదు. కానీ జపాన్ లో మాత్రం ఈ పాట భారీ వైరల్ గా మారింది. దీంతో ఈ లిరిక్స్ కి అర్థం ఏమిటి? అని నెటిజన్స్ ఆరా తీయగా.. ఈ పాట లిరిక్స్ కి సంబంధించిన మీనింగ్ తాజాగా బయటకు రావడంతో ఇంత అద్భుతమైన లిరిక్స్ తెలుగులో కూడా పెట్టి ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

లిరిక్స్ విషయానికి వస్తే.. ఈ జపనీస్ హైకూ ను చెప్పడానికి ముందు పవన్ కళ్యాణ్ విలన్ ఓమీకి వార్నింగ్ ఇస్తాడు." ఓమీ.. ఓ మై డియర్ ఓమీ.. ఎగిరెగిరి పడుతున్నావ్.. నీలాంటి వాడిని ఎలా నేలకు దించాలో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నా గురువు చెప్పిన కథ చెబుతాను.. విను" అంటూ వాషి యో వాషి అనే పాటను పాడతాడు పవన్ కళ్యాణ్.. ఇక ఆ పాటకు అర్థం ఏమిటి అనే విషయాన్నికొస్తే.. "గద్దా ఓ గద్దా.. నువ్వు అడవి గద్దని చంపాలి అంటే.. ముందు దాన్ని రెక్కలు తెగ నరకాలి. అది నేల మీద పడ్డాక దాని కళ్ళు పీకేయాలి. ఒక్కసారి అది గుడ్డిదైతే ఎటు పోవాలో దానికి తెలియదు. అప్పుడు దాని కాళ్లు నరికితే ఇక ఎప్పటికీ కదల్లేదు. అప్పుడు దాని రాకాసి గుండెను బయటకు లాగాలి .. గద్దా ఓ గద్దా" అంటూ జపనీస్ హైకూకి తెలుగు అర్థం వెతికేశారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ లిరిక్స్ ఇప్పుడు తెలుగులో కూడా ఆకట్టుకుంటుంది .